Kareena Kapoor | దిశా ఎన్‌కౌంటర్‌పై కరీనా కపూర్ బాలీవుడ్ మూవీ – సజ్జనార్ పాత్రలో మలయాళ స్టార్ హీరో
2019లో హైదరాబాద్‌లో జరిగిన దిశా ఎన్‌కౌంటర్ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ మూవీ రాబోతుంది. డాయ్‌రా పేరుతో రూపొందిన ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద్వారా రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది కరీనా కపూర్.
Entertainment | Published On Aug 31, 2026, 4.14 pm IST
Kareena Kapoor | కరీనా కపూర్ రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో సినిమా చేసింది. 2024లో రిలీజైన సింగం అగైన్ తర్వాత కరీనా కపూర్ బాలీవుడ్‌కు దూరమైంది. టాక్సిక్‌తో పలు పాన్ ఇండియన్ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని రిజెక్ట్ చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డాయ్‌రా పేరుతో రూపొందిన ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు.
మలయాళ నటుడు...
ఈ బాలీవుడ్ మూవీలో మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్నారు. డాయ్‌రా సెప్టెంబర్ 18న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. సోమవారం ఈ బాలీవుడ్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ఇద్దరూ పోలీస్ ఆఫీసర్లుగా కనిపించారు. ఓ నేరానికి సంబంధించిన నిజాలను వెలికితీసే క్రమంలో ఇద్దరు వేర్వేరుగా దర్యాప్తులు చేస్తారు. విధి నిర్వహణ, న్యాయం విషయంలో ఇద్దరి ఆలోచనా విధానాలు పూర్తిగా భిన్నంగా ఉన్నట్లుగా ట్రైలర్‌లో చూపించారు.ఇందులో ఎవరిది తప్పు, ఏది ఒప్పు అనే అంశాలతో ఎమోషనల్‌గా ఈ ట్రైలర్ సాగింది.
దిశా ఎన్‌కౌంటర్...
2019లో హైదరాబాద్‌లో జరిగిన దిశా ఎన్‌కౌంటర్ ఆధారంగా డైరెక్టర్ మేఘన గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. దిశా ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్‌కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమీషన్ విచారణ జరిపింది. బూటకపు ఎన్‌కౌంటర్‌గా తేల్చింది. ఆ అంశాలను డాయ్‌రా ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్ చూస్తుంటే పృథ్వీరాజ్ సుకుమారన్...ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బాలీవుడ్ మూవీలో జితేంద్ర జోషి, క్షితీ జోగ్, కన్వల్‌జీత్ సింగ్, సందీప్ కులకర్ణి, తృప్తి కమ్కర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దిశా ఎన్‌కౌంటర్ ఆధారంగా గతంలో చాలానే సినిమాలో వచ్చాయి. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఆశ ఎన్‌కౌంటర్ పేరుతో ఓ సినిమా చేశారు.\
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nora Fatehi | బాధితురాలిగా నటించొద్దు – ఇల్లు, కారు గిఫ్ట్‌గా ఇచ్చా – నోరా ఫతేహిపై సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు
ఆగస్టు 30, 2026

Deepika Padukone | ఆ హీరో కంటే నా సక్సెస్ రేటు ఎక్కువ – స్పిరిట్ వివాదం వేళ దీపికా పడుకోణ్ కామెంట్స్ వైరల్
ఆగస్టు 28, 2026

Raksha Bhandhan | రక్షా బంధన్‌ను సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ – అక్కతో మహేష్ – తమ్ముడికి రాఖీ కట్టిన కంగనా రనౌత్
ఆగస్టు 28, 2026
తాజావార్తలు
- ●Nurse Murdered case | అత్యాచారాన్ని అడ్డుకోబోయిన నర్సు.. అయినా దారుణ హత్య
- ●Harish Rao | కృష్ణా జలాల తరలింపుపై రేవంత్ మౌనం.. తెలంగాణకు తీరని ద్రోహం : హరీశ్‌రావు
- ●Asaduddin Owaisi | బాబర్ పుట్టిన దేశం నుంచే ప్రధానికి అత్యున్నత పురస్కారం.. సంఘ్ సభ్యులు ఆలోచించుకోండి : ఒవైసీ
- ●Harish Rao | ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటు : హరీశ్‌రావు
- ●Tim Cook | యాపిల్ ముఖ చిత్రాన్ని మార్చిన టిమ్ కుక్.. సీఈవోగా నేడే చివరి పని రోజు..
- ●Kathua Pigeon Caught | జమ్ముకశ్మీర్‌లో 'పాకిస్థాన్ పావురం' కలకలం.. కాలికి ఉన్న రింగ్‌పై ఏముందంటే?

Nurse Murdered case | అత్యాచారాన్ని అడ్డుకోబోయిన నర్సు.. అయినా దారుణ హత్య

Harish Rao | కృష్ణా జలాల తరలింపుపై రేవంత్ మౌనం.. తెలంగాణకు తీరని ద్రోహం : హరీశ్‌రావు

Asaduddin Owaisi | బాబర్ పుట్టిన దేశం నుంచే ప్రధానికి అత్యున్నత పురస్కారం.. సంఘ్ సభ్యులు ఆలోచించుకోండి : ఒవైసీ

Harish Rao | ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటు : హరీశ్‌రావు



