త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | చిరంజీవి హీరో – ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌గా వ‌చ్చిన తెలుగు సినిమాలు ఇవే

చిరంజీవి హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్మాత‌గా తెలుగులో ఓ మూడు సినిమాలు వ‌చ్చాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుతో కాకుండా కే క‌ళ్యాణ్ కుమార్ పేరుతో నిర్మించారు.ఆ సినిమాలు ఏవంటే?

N

Entertainment | Published On Jun 12, 2026, 7.38 pm IST

Pawan Kalyan | చిరంజీవి హీరో – ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌గా వ‌చ్చిన తెలుగు సినిమాలు ఇవే
Advertisement

Pawan Kalyan | మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో ఫుల్ లెంగ్త్‌ సినిమా రావాల‌న్న‌ది అభిమానుల క‌ల‌. చిరంజీవి హీరోగా న‌టించిన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌, శంక‌ర్ దాదా జిందాబాద్ సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెస్ట్‌గా క‌నిపించారు. వీటి కంటే ముందే ఈ మెగా హీరోల కాంబినేష‌న్‌లో కొన్ని సినిమాలు వ‌చ్చాయి. అయితే వాటిలో చిరంజీవితో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు. ఆ సినిమాల‌కు కేవ‌లం ప్రొడ్యూస‌ర్‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించాడు. చిరంజీవి హీరోగా న‌టించిన త్రినేత్రుడు, ముగ్గురు మొన‌గాళ్లుతో పాటు రుద్ర‌వీణ సినిమాల‌ను మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుతో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్మించారు.

కే క‌ళ్యాణ్ కుమార్‌...

టైటిల్ క్రెడిట్స్‌లో స‌హ నిర్మాత‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు క‌నిపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని కాకుండా కే క‌ళ్యాణ్ కుమార్‌గా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. ఈ మూడు సినిమాల్లో ముగ్గురు మొన‌గాళ్లు ఒక్క‌టే క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. రుద్ర‌వీణ‌కు నేష‌న‌ల్ అవార్డులు వ‌చ్చాయి. కానీ డ‌బ్బులు మాత్రం రాలేదు. త్రినేత్రుడు చిరంజీవి కెరీర్‌లో డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా నిలిచింది.

ఓజీ 2...

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాతో పాటు ఓజీ 2కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

 

Advertisement
Advertisement