త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Advisory | వంతెన పున‌ర్నిర్మాణ ప‌నులు.. మూడు రోజుల పాటు ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్‌

Traffic Advisory | అశోక్‌న‌గ‌ర్‌-ఇందిరాపార్క్ మ‌ధ్య వంతెన పున‌ర్నిర్మాణ ప‌నుల నేప‌థ్యంలో మూడురోజుల పాటు ట్రాఫిక్‌ను మ‌ళ్లించ‌నున్న‌ట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయ‌ల్ డేవిస్ వెల్లించారు. అశోక్‌న‌గ‌ర్‌లోని అర‌వింద్‌న‌గ‌ర్ వ‌ద్ద ఉన్న హుస్సేన్‌సాగ‌ర్ స‌ర్‌ప్ల‌స్ నాలాపై పాత వంతెనను కూల్చివేసి కొత్త స్లాబ్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ మ‌ళ్లించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

P

Hyderabad | Published On Jun 12, 2026, 7.01 pm IST

Traffic Advisory | వంతెన పున‌ర్నిర్మాణ ప‌నులు.. మూడు రోజుల పాటు ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్‌
Advertisement

Traffic Advisory | అశోక్‌న‌గ‌ర్‌-ఇందిరాపార్క్ మ‌ధ్య వంతెన పున‌ర్నిర్మాణ ప‌నుల నేప‌థ్యంలో మూడురోజుల పాటు ట్రాఫిక్‌ను మ‌ళ్లించ‌నున్న‌ట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయ‌ల్ డేవిస్ వెల్లించారు. అశోక్‌న‌గ‌ర్‌లోని అర‌వింద్‌న‌గ‌ర్ వ‌ద్ద ఉన్న హుస్సేన్‌సాగ‌ర్ స‌ర్‌ప్ల‌స్ నాలాపై పాత వంతెనను కూల్చివేసి కొత్త స్లాబ్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ మ‌ళ్లించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ పనులు శ‌నివారం నుంచి ఈ నెల 15 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వంతెనపై గిర్డర్లు అమర్చ‌నున్న నేప‌థ్యంలో అశోక్‌న‌గ‌ర్ ఎక్స్‌రోడ్ నుంచి ఇందిరాపార్క్ రోడ్ వ‌ర‌కు ర‌హ‌దారిని పూర్తిగా నియంత్ర‌ణ‌లోకి తీసుకోనున్నారు.

ఈ క్ర‌మంలో చిక్క‌డ‌ప‌ల్లి, గాంధీన‌గ‌ర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని కీల‌క రూట్ల‌లో 24గంట‌ల పాటు డైవ‌ర్ష‌న్ కొన‌సాగుతుంద‌ని, దాంతో వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ‌మార్గాల‌ను అనుస‌రించాల‌ని పోలీసులు సూచించారు. హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెం.9 నుంచి ఇందిరాపార్క్ వైపు వెళ్లే వాహ‌న‌దారుల‌కు నేరుగా అవ‌కాశం ఉండ‌ద‌ని, వాటిని అశోక్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద నుంచి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం రోడ్‌లోకి మళ్లించి, అక్కడి నుంచి బాకారం బ్రిడ్జ్, ఎల్ఐసీ కాల‌నీ, బండ్లమైసమ్మ ఎక్స్ రోడ్, ధ‌ర్నాచౌక్ మీదుగా ఇందిరాపార్క్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. అలాగే, ఆర్టీసీ క్రాస్‌రోడ్ నుంచి ఇందిరాపార్క్ వైపుగా వాహ‌నాల‌కు అనుమ‌తి ఉండ‌ది.. వాటిని కవాడిగూడ వైపు మళ్లించి, బాకారం బ్రిడ్జ్, ఎల్‌ఐసీ కాలనీ, బండ్లమైసమ్మ రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంద‌న్నారు. బాకారం, ఆర్‌సీ రెడ్డి లేన్ నుంచి వచ్చే వాహనాలను అశోక్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద నిలిపివేసి, స్ట్రీట్ నెం.9, సూర‌జ్‌న‌గ‌ర్ నాలా బ్రిడ్జి, దోమలగూడ టీ జంక్షన్ మీదుగా హిమాయత్‌నగర్, ఇందిరాపార్క్ వైపు మ‌ళ్లించ‌నున్న‌ట్లు తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య అద‌నంగా డైవ‌ర్ష‌న్ అమ‌లులో ఉంటాయి.

కట్టమైసమ్మ నుంచి అశోక్‌నగర్ వైపు వచ్చే వాహనాలను బండ్లమైసమ్మ, ఎల్‌ఐసీ కాలనీ, బాకారం బ్రిడ్జ్ మార్గం మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. ధర్నా చౌక్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఏవీ కాలేజీ దోమలగూడ లేన్ వైపు, అదే మార్గంలో అశోక్‌నగర్ వైపు వెళ్లే వాహనాలను తిరిగి బండ్లమైసమ్మ–ఎల్‌ఐసీ కాలనీ–బాకారం బ్రిడ్జ్ మార్గంలోకి మ‌ళ్లించ‌నున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వంతెన పున‌ర్నిర్మాణ ప‌నుల నేప‌థ్యంలో మూడురోజుల పాటు కీల‌క కారిడార్‌లో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్ర‌యాణానికి ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. అత్యవసరం లేకుంటే ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోవాల‌ని సూచించారు. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌, అత్యవసర పరిస్థితుల్లో 9010203626 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని జోయ‌ల్ డేవిస్ సూచించారు.

Advertisement
Advertisement