CP Sajjanar | బ్యాంకు ఉద్యోగికి సైబర్ నేరాలపై అవగాహన అవసరం : సీపీ సజ్జనార్
CP Sajjanar | ప్రజల సొమ్ముకు రక్షకులైన బ్యాంకు ఉద్యోగులు సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
CP Sajjanar | ప్రజల సొమ్ముకు రక్షకులైన బ్యాంకు ఉద్యోగులు సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్, జోనల్ హెడ్ సుధాకర్‌తో పాటు వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో వివిధ భాషల్లో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్‌ను సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు.
అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. ప్రజల సొమ్ముకు సంరక్షకులమనే విషయాన్ని బ్యాంకు సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని సూచించారు. ప్రతి బ్యాంకు ఉద్యోగి తమ శాఖలో ‘జీరో మ్యూల్ అకౌంట్ ఛాలెంజ్’, ‘సేఫ్ కస్టమర్ ఛాలెంజ్’లను తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. తమ శాఖ పరిధిలోని ఖాతాదారుల్లో ఒక్కరు కూడా సైబర్ నేరాల బారిన పడకూడదనే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ ద్వారా సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే కేసుల దర్యాప్తులో పలువురు బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాలపై కనీస అవగాహన కూడా లేదని తేలిందని పేర్కొన్నారు.
కొత్త ఖాతాల ప్రారంభంలో చూపుతున్న శ్రద్ధను సైబర్ మోసాల బాధితుల విషయంలో కూడా చూపించాలని సూచించారు. ఒక్క సైబర్ బాధితుడు కూడా లేని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి పురస్కారాలు అందించడం ద్వారా ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. కేవలం వ్యాపార లక్ష్యాల సాధనకే పరిమితం కాకుండా ప్రతి బ్యాంకు ఉద్యోగి సామాజిక బాధ్యతతో పనిచేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!
- ●Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..
- ●US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
- ●HYDRAA | హైడ్రా రిక్రూట్మెంట్కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
- ●Road Accident | బస్సు బోల్తా.. ఏడుగురు మృతి
- ●Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల

పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!

Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..

US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

HYDRAA | హైడ్రా రిక్రూట్మెంట్కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత






