Gopichand | రగ్గ్‌డ్ లుక్‌లో గోపీచంద్ – నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే – హీరోయిన్‌గా మలయాళ ముద్దుగుమ్మ
గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా అతడి నెక్స్ట్ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సింగ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గోపీచంద్ రగ్గ్‌డ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
Entertainment | Published On Jun 12, 2026, 6.56 pm IST
Gopichand | మాస్ కథలకు టాలీవుడ్‌లో కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారుహీరో గోపీచంద్. యాక్షన్ అంశాల కలబోతగా గోపీచంద్ చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. కొంత గ్యాప్ తర్వాత కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో గోపీచంద్ కనిపించబోతున్నారు. గోపీచంద్ హీరోగా ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బర్త్‌డే ట్రీట్...
గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సింగ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వీడియో గ్లింప్స్ ఆడవి ఎఫెక్ట్, ట్రైబల్ మ్యూజిక్‌తో ఆసక్తికరంగా మొదలైంది. చిరుత పులిని పోలిన ఆకారం నుంచి గోపీచంద్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో గ్లింప్స్‌లో పొడవైన మీసకట్టు, గడ్డంతో రగ్గ్‌డ్ లుక్‌లో గోపీచంద్ కనిపిస్తున్నారు.
ఫైట్ మాస్టర్ వెంకట్...
ఈ మాస్ రోల్ కోసం గోపీచంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సింగ సినిమాతోనే ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
మలయాళ ముద్దుగుమ్మ...
సింగ సినిమాలో మలయాళ బ్యూటీ అనార్కలి నజర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదే ఆమెకు తొలి తెలుగు మూవీ కావడం గమనార్హం. ప్రస్తుతం సింగ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం సింగతో పాటు భరతవర్ష పేరుతో ఓ హిస్టారికల్ మూవీ కూడా చేస్తోన్నాడు గోపీచంద్. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
సంబంధిత వార్తలు

Pawan Kalyan | చిరంజీవి హీరో – పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్‌గా వచ్చిన తెలుగు సినిమాలు ఇవే
జూన్ 12, 2026

Natasha Singh | టాలీవుడ్ హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫైనలిస్ట్ – ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్
జూన్ 12, 2026

Pawan Kalyan | అప్డేట్తోనే ఓజీ 2 రికార్డులు – పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ క్రేజ్ మామూలుగా లేదుగా!
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●Kollywood | హీరోకు 60 ఏళ్లు - హీరోయిన్‌కి 21 ఏళ్లు - చియాన్ విక్రమ్ కొత్త మూవీపై నెటిజన్ల ట్రోలింగ్
- ●Kancha Gachibowli | హెచ్‌సీయూ భూముల్లో మళ్లీ బుల్డోజర్..? హైదరాబాద్ ఊపిరితిత్తులపై దాడి..!
- ●CP Sajjanar | బ్యాంకు ఉద్యోగికి సైబర్ నేరాలపై అవగాహన అవసరం : సీపీ సజ్జనార్
- ●Inflation | సామాన్యుడి జేబుకు ద్రవ్యోల్బణం చిల్లు.. దేశంలోనే తెలంగాణ టాప్..!
- ●Pawan Kalyan | చిరంజీవి హీరో - పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్‌గా వచ్చిన తెలుగు సినిమాలు ఇవే
- ●Traffic Advisory | వంతెన పునర్నిర్మాణ పనులు.. మూడు రోజుల పాటు ట్రాఫిక్ డైవర్షన్

Kollywood | హీరోకు 60 ఏళ్లు - హీరోయిన్‌కి 21 ఏళ్లు - చియాన్ విక్రమ్ కొత్త మూవీపై నెటిజన్ల ట్రోలింగ్

Kancha Gachibowli | హెచ్‌సీయూ భూముల్లో మళ్లీ బుల్డోజర్..? హైదరాబాద్ ఊపిరితిత్తులపై దాడి..!

CP Sajjanar | బ్యాంకు ఉద్యోగికి సైబర్ నేరాలపై అవగాహన అవసరం : సీపీ సజ్జనార్

Inflation | సామాన్యుడి జేబుకు ద్రవ్యోల్బణం చిల్లు.. దేశంలోనే తెలంగాణ టాప్..!



