Harish Rao | కాంగ్రెస్ సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చేసింది : హరీశ్ రావు
Harish Rao | తెలంగాణకు వరంగా నిలిచిన సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, సింగరేణిలో జరుగుతున్న అవినీతిని భాగోతాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా వివరించారు.
Harish Rao | తెలంగాణకు వరంగా నిలిచిన సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, సింగరేణిలో జరుగుతున్న అవినీతిని భాగోతాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని సంపద తెలంగాణకు సింగరేణి రూపంలో లభించిందన్నారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి ఒకప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో కళకళలాడేదని, ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కార్మికుల జీవితాలు దెబ్బతిన్నాయని అన్నారు. మట్టి, ఇసుక, బట్టలు, బూట్లు, కోడిగుడ్లు, బొగ్గు కొనుగోళ్లు సహా ప్రతిచోటా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కారుణ్య నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 16 వేల మందికి కారుణ్య నియామకాలు కల్పించామని, ప్రస్తుతం వాటిపైనే విచారణలు జరిపి ఉద్యోగాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ అన్‌ఫిట్ ప్రక్రియలోనూ కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పోరాటం ఫలితంగానే పెండింగ్‌లో ఉన్న 400 ఉద్యోగాల భర్తీపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారని పేర్కొన్నారు.
సైట్ విజిట్ సర్టిఫికేట్‌తో టెండర్లలో అవకతవకలు
సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకువచ్చి టెండర్లను కొందరికి కట్టబెట్టారని హరీశ్ రావు ఆరోపించారు. ఈ విధానం కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ వంటి సంస్థల్లో లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రవేశపెట్టారని అన్నారు. వెంకటేష్ ఖనిలో శోధా కన్స్ట్రక్షన్‌కు ప్లస్ 13 శాతం అధిక ధరకు టెండర్ ఇచ్చారని, ఒక్క టెండర్ ద్వారానే సింగరేణికి దాదాపు రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓసీ టెండర్‌ను ఏడు సార్లు వాయిదా వేసి, తర్వాత మైనస్ 12 శాతానికి ఖరారు చేయడంతో సింగరేణి సొమ్ము ఆదా అయిందన్నారు. సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో భారీ కుంభకోణాలు జరిగాయని హరీశ్ రావు ఆరోపించారు. విద్యుత్ సంస్థలు సోలార్ విద్యుత్ కొనుగోలు చేయబోమని సర్క్యులర్ ఇచ్చినా, 67 మెగావాట్లు, 107 మెగావాట్ల ప్రాజెక్టులకు టెండర్లు ఇచ్చారని విమర్శించారు. మూడు కోట్ల రూపాయలకు పూర్తయ్యే మెగావాట్ సామర్థ్యాన్ని ఏడు కోట్ల రూపాయలకు అప్పగించారని, 67 మెగావాట్ల ప్రాజెక్టులోనే రూ.250 కోట్ల అదనపు భారం పడిందన్నారు. రూ.480 కోట్లతో నిర్మించిన 67 మెగావాట్ల ప్లాంట్‌కు రెండేళ్లు గడిచినా సింక్రనైజేషన్, పీపీఏ లేక నిరుపయోగంగా మారిందని చెప్పారు. 107 మెగావాట్ల ప్రాజెక్టు కూడా అదే పరిస్థితిలో ఉందన్నారు.
జైపూర్ పవర్ ప్లాంట్‌పై ప్రశ్నలు
జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ పేరుతో మరో కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ లేకుండా, డీపీఆర్ ఆమోదం పొందకుండానే టెండర్లు పిలిచారని విమర్శించారు. ఇప్పటికే రూ.1,000 కోట్లకుపైగా ఖర్చు చేశారని చెప్పారు. తెలంగాణ అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశమేంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని కోరారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం అయ్యిందని హరీశ్ రావు ఆరోపించారు. భూపాలపల్లి గనిలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు లేవని, ఉత్పత్తి గణాంకాలను మార్చి స్టాక్‌లు చూపిస్తున్నారని అన్నారు. అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు రెండేళ్లుగా మూతపడినా అక్కడ లక్షా 81 వేల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నట్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. బొగ్గు గనుల్లో వినియోగించే ఎక్స్‌ప్లోజివ్ స్టిక్స్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో రూ.37 వేల ధర ఉన్న పదార్థాన్ని సింగరేణిలో రూ.44 వేలకుపైగా కొనుగోలు చేశారని, ఒక్క ఆర్డర్ ద్వారానే రూ.300 కోట్ల వ్యత్యాసం వచ్చిందన్నారు. ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించిన ఇద్దరు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపిస్తూ వారికి అభినందనలు తెలిపారు. డీజిల్ కొనుగోళ్లను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాకుండా ప్రైవేట్ బంకుల ద్వారా నిర్వహించడం వల్ల ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని విమర్శించారు.
ఉత్పత్తి తగ్గింది.. బకాయిలు పెరిగినయ్..
అవినీతి కారణంగా సింగరేణి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని హరీశ్ రావు అన్నారు. 2023లో 70 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి 2025-26 నాటికి 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని పేర్కొన్నారు. దీంతో కార్మికుల బోనస్‌లు కూడా ప్రభావితమవుతాయని తెలిపారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పాలనలో జెన్‌కో బకాయిలు రూ.7 వేల కోట్లుగా ఉండగా, కాంగ్రెస్ పాలనలో రెండున్నరేళ్లలోనే అవి రూ.12,377 కోట్లకు చేరాయని ఆరోపించారు. సింగరేణి అభివృద్ధి పేరుతో రూ.6 వేల కోట్ల నిధులను పక్కన పెట్టి, మరోవైపు రూ.4,300 కోట్ల ఓడీ రుణాలు తీసుకోవడం వెనుక కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా, వాటిని ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కార్మికులు సింగరేణి భవిష్యత్తుపై ఆలోచించాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ జరుగుతున్న అవినీతిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్పందించడం లేదని విమర్శించారు. సింగరేణిలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న అవినీతిపై సీబీఐ విచారణతో పాటు సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడాలంటే "కాంగ్రెస్ కో హటావ్ - సింగరేణి బచావ్" నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హరీశ్ రావు హెచ్చరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kollywood | హీరోకు 60 ఏళ్లు - హీరోయిన్‌కి 21 ఏళ్లు - చియాన్ విక్రమ్ కొత్త మూవీపై నెటిజన్ల ట్రోలింగ్
- ●Kancha Gachibowli | హెచ్‌సీయూ భూముల్లో మళ్లీ బుల్డోజర్..? హైదరాబాద్ ఊపిరితిత్తులపై దాడి..!
- ●CP Sajjanar | బ్యాంకు ఉద్యోగికి సైబర్ నేరాలపై అవగాహన అవసరం : సీపీ సజ్జనార్
- ●Inflation | సామాన్యుడి జేబుకు ద్రవ్యోల్బణం చిల్లు.. దేశంలోనే తెలంగాణ టాప్..!
- ●Pawan Kalyan | చిరంజీవి హీరో - పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్‌గా వచ్చిన తెలుగు సినిమాలు ఇవే
- ●Traffic Advisory | వంతెన పునర్నిర్మాణ పనులు.. మూడు రోజుల పాటు ట్రాఫిక్ డైవర్షన్

Kollywood | హీరోకు 60 ఏళ్లు - హీరోయిన్‌కి 21 ఏళ్లు - చియాన్ విక్రమ్ కొత్త మూవీపై నెటిజన్ల ట్రోలింగ్

Kancha Gachibowli | హెచ్‌సీయూ భూముల్లో మళ్లీ బుల్డోజర్..? హైదరాబాద్ ఊపిరితిత్తులపై దాడి..!

CP Sajjanar | బ్యాంకు ఉద్యోగికి సైబర్ నేరాలపై అవగాహన అవసరం : సీపీ సజ్జనార్

Inflation | సామాన్యుడి జేబుకు ద్రవ్యోల్బణం చిల్లు.. దేశంలోనే తెలంగాణ టాప్..!




