Pawan Kalyan vs Ranveer Singh | మూడు రోజుల్లోనే 500 కోట్లతో ధురంధర్ 2 రికార్డ్ …. తెలుగులో మాత్రం పవన్‌కళ్యాణ్‌దే డామినేషన్
బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద చరిత్రను సృష్టించింది. మూడు రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. తెలుగులో మాత్రం ధురంధర్ 2పై పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ డామినేషన్ కనిపిస్తోంది.
Entertainment | Published On Mar 22, 2026, 4.59 pm IST
Pawan Kalyan vs Ranveer Singh | బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద చరిత్రను సృష్టించింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. తొలిరోజు కంటే మూడో రోజు ఈ స్పై యాక్షన్ సినిమా ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం. ఫస్ట్ డే ఇండియా వైడ్‌గా 102 కోట్ల నెట్ కలెక్షన్స్ దక్కించుకున్న ధురంధర్ 2 శనివారం మాత్రం 113 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. ఆదివారం రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
దక్షిణాదిలో రిలీజ్...
మార్చి 19న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సెన్సార్‌తో పాటు డబ్బింగ్ ఇష్యూస్ వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. శనివారం నుంచి తెలుగు, తమిళం, మలయాళ వెర్షన్లు థియేటర్లలోకి వచ్చాయి. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగాఈ డబ్బింగ్ వెర్షన్లు భారీగానే వసూళ్లను దక్కించుకున్నాయి. మూడో రోజు వసూళ్లు పెరగడానికి అదే కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
పవన్‌దే డామినేషన్...
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధురంధర్ 2 మూవీపై పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ డామినేషన్ కనిపించింది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ 9 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకోగా...ధురంధర్ 2 తెలుగు వెర్షన్‌కు ఐదు కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. శుక్రవారం నాటితో పోలిస్తే శనివారం పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్స్ కూడా పెరిగాయి.
కానీ ఓవరాల్ కలెక్షన్స్‌లో ధురంధర్ 2కు ఉస్తాద్ భగత్‌సింగ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మూడు రోజుల్లో ఉస్తాద్ భగత్‌సింగ్ కేవలం 56 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
ఆదిత్య ధర్...
ధురంధర్ 2 మూవీలో రణవీర్‌సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సంజయ్‌దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. ధురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది.మరోవైపు ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






