Dhurandhar 2 | గ్రామీ అవార్డుల రేసులో ధురంధర్ 2 – తొమ్మిది విభాగాల్లో పోటీ
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ధురంధర్ 2 గ్రామీ రేసులో నిలవబోతుంది. 2027లో జరుగనున్న గ్రామీ అవార్డుల కోసం తొమ్మిది విభాగాల్లో ధురంధర్ 2ను పరిశీలనకు పంపించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. రణవీర్‌సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 1850 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది.
Entertainment | Published On Oct 10, 2026, 5.32 pm IST
Dhurandhar 2 | రణవీర్ సింగ్ (Ranveer Singh)హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ధురంధర్ 2లో రణవీర్ సింగ్ యాక్టింగ్, ఆదిత్య ధర్ టేకింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. భారత దేశాన్ని దెబ్బతీసేందుకు పాకిస్థాన్ చేసిన కుట్రలు ఓ గూఢచారి ఎలా తిప్పికొట్టాడు? పాకిస్థాన్‌లో మారుపేరుతో ఉంటూ శత్రువులను ఏ విధంగా ఎదుర్కొన్నాడనే అంశాలతో ఆదిత్య ధర్ ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు 3 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయినా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదంటూ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి.
2027 గ్రామీ అవార్డులు ....
తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన ధురంధర్ 2 ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల రేసులో నిలవబోతుంది. 2027 గ్రామీ అవార్డుల కోసం తొమ్మిది విభాగాల్లో పరిశీలనకు పంపినట్లు మేకర్స్ ప్రకటించారు. శశ్వాత్ సచ్‌దేవ్ సంగీతం అందించిన ఈ సినిమా మొత్తం ఆల్బమ్‌తో పాటు బెస్ట్ సాంగ్ రిటన్ ఫర్ విజువల్ మీడియా, బెస్ట్ ఏషియన్ పాప్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ , బెస్ట్ రాప్ పెర్ఫార్మెన్స్ మరో ఐదు విభాగాల్లో పోటీ కోసం పంపించారు.
స్లమ్ డాగ్ మిలియనీర్ మాత్రమే...
వచ్చే ఏడాది జనవరిలో ఈ నామినేషన్స్‌పై క్లారిటీ రాబోతుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో గ్రామీ అవార్డుల వేడుక జరుగనుంది. ఎన్ని విభాగాల్లో తుది నామినేషన్‌కు ఈ సినిమా ఎంపికవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు స్లమ్ డాగ్ మిలియనీర్ మాత్రమే గ్రామీ అవార్డులను అందుకుంది.
ధురంధర్ 2 సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. 255 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 1850 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nana Patekar | కార్గిల్ యుద్ధంలో పోరాడిన నానా పటేకర్ – షూటింగ్లో నేషనల్ మెడల్స్
అక్టోబర్ 8, 2026

Nana Patekar | భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటుల్లో నానా పటేకర్ ఒకరు: జూనియర్ ఎన్టీఆర్
అక్టోబర్ 8, 2026

Oscars 2027 | ఆస్కార్ రేసులో నాగాలాండ్ మూవీ – 23 రోజుల్లో షూటింగ్ పూర్తి – మతమార్పిడిలపై గిరిజనుల పోరాటం
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!
- ●GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..
- ●MDMA Drugs | రంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ డ్రగ్స్
- ●6G Network | భారత్‌లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..
- ●KTR | ఉద్యమ బిడ్డ కుటుంబానికి కేటీఆర్ అండ.. 9 లక్షల ఆర్థిక సాయం
- ●Shruti Haasan | రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా సినిమా - శోభిత ధూళిపాళ తమిళ మూవీలో శృతి హాసన్ గెస్ట్ రోల్!

Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!

GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..

MDMA Drugs | రంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ డ్రగ్స్

6G Network | భారత్‌లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..



