Dhurandhar 2 Director | టీమిండియా సెలెక్షన్స్‌లో రిజెక్ట్ – క్రికెటర్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ – ధురంధర్ 2 దర్శకుడి లైఫ్‌లో ట్విస్ట్‌లు
ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ క్రికెటర్ కావాలని అనుకున్నాడు. టీమిండియాకు ఆడాలని కలలు కన్నాడు. కానీ సెలెక్షన్స్‌లోని అవినీతి కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన అతడు చివరకు డైరెక్టర్‌గా మారాడు.
Entertainment | Published On Mar 16, 2026, 7.56 pm IST
Dhurandhar 2 Director | రణవీర్‌సింగ్ హీరోగా నటిస్తున్న ధురంధర్ 2 మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో ఓ రేంజ్‌లో హైప్ నెలకొంది. బాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీల ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమా వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంది. తొలి రోజు కలెక్షన్స్ పరంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను ధురంధర్ 2 తిరగరాయడం ఖాయమని అంటున్నారు. ధురంధర్ మూవీకి సీక్వెల్‌గా డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ 1400 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. అత్యధిక వసూళ్లను రాబట్టిన బాలీవుడ్ మూవీగా చరిత్రను సృష్టించింది.
ఆర్‌జీవీ ప్రశంసలు...
రణవీర్‌సింగ్ యాక్టింగ్‌తో పాటు డైరెక్టర్ ఆదిత్య ధర్ స్టోరీ, మేకింగ్, టేకింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాతో నేషనల్ వైడ్‌గా ఆదిత్య ధర్ పేరు మారుమోగుతోంది. ఆర్‌జీవీ, రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు సైతం ఆదిత్య ధర్‌పై ప్రశంసలు కురిపించారు.
క్రికెట్ వదిలి...
ఆదిత్య ధర్ డైరెక్టర్ కావాలని అనుకోలేదట. క్రికెటర్‌గా టీమిండియాకు ఆడాలని కలలు కన్నాడట. కానీ సెలెక్షన్‌లోని పక్షపాతం, అవినీతి కారణంగా చాలా ఏళ్ల పాటు సాధన చేసిన క్రికెట్‌ను వదిలిపెట్టి ఆదిత్య ధర్ సినిమాల్లోకి వచ్చాడట.
అండర్ 19 క్రికెట్...
చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఇష్టాన్ని పెంచుకున్న ఆదిత్య ధర్ 2000 దశకంలో దేశవాళీతో పాటు లోకల్ టోర్నీలలో బ్యాటర్‌గా మెరుపులు మెరిపించాడు. టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ ప్రాబబుల్స్‌లో అతడి పేరు వినిపించింది. ప్రపంచకప్ లో అతడికి చోటు దక్కడం ఖాయమని అనుకున్నారు.
ఛాన్స్ మిస్...
కానీ సెలెక్షన్స్‌లోని అవినీతి, బంధుప్రీతి కారణంగా ఆదిత్య ధర్‌కు స్థానం దక్కలేదట. అతడి స్థానంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ తనయుడు రోజర్ బిన్నీని వరల్డ్‌కప్‌కు సెలెక్ట్ చేశారట. సెంచరీలు చేసిన ఆదిత్య ధర్‌ను కాదని ఆరు మ్యాచుల్లో 36 పరుగులే చేసిన రోజర్ బిన్నీకి వరల్డ్ కప్‌కు ఎంపికయ్యాడు. ఆ సంఘటన ఆదిత్య ధర్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టిందట. దాంతో క్రికెట్‌ను వదిలేసి సినిమాల్లోకి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య ధర్ చెప్పాడు. మలయాళ డైరెక్టర్ ప్రియదర్శన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆదిత్య ధర్ ఉరి సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్నాడు. ధురంధర్‌తో టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



