త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో వివాదం – దిగొచ్చిన ధృవ్ విక్ర‌మ్‌

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ‌తో నెల‌కొన్న వివాదానికి కోలీవుడ్ హీరో ధృవ్ విక్ర‌మ్ పుల్‌స్టాప్ పెట్టాడు. ర‌మేష్ వ‌ర్మ‌తో ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన ధృవ్‌...షూటింగ్ మొద‌ల‌య్యే టైమ్‌లో ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు. ఈ వివాదం త‌మిళ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ర‌కు వెళ్లింది. గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో దిగొచ్చిన ఈ కోలీవుడ్ హీరో...ర‌మేష్ వ‌ర్మ‌ సినిమాను కంప్లీట్ చేయ‌డానికి అంగీక‌రించాడు.

N

Entertainment | Published On Sep 12, 2026, 7.15 pm IST

Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో వివాదం – దిగొచ్చిన ధృవ్ విక్ర‌మ్‌
Advertisement

Dhruv Vikram |  గ‌త కొద్ది రోజులుగా విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్‌ను వ‌రుస‌గా వివాదాలు చుట్టుముడుతున్నాయి. హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో బ్రేక‌ప్ విష‌యంలో ధృవ్‌ను చాలా మంది ట్రోల్ చేశారు. రెండేళ్లు త‌న‌కు న‌ర‌కం చూపించాడ‌ని, ఎవ‌రితో మాట్లాడ‌టానికి అనుమ‌తించే వాడు కాదంటూ ఈ కోలీవుడ్ హీరోపై అనుప‌మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న కెరీర్‌ను నాశ‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడంటూ కామెంట్లు పెట్టింది. అనుప‌మ వ్యాఖ్య‌ల‌తో ధృవ్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి.

కోటి రూపాయ‌ల అడ్వాన్స్‌...

బ్రేక‌ప్ గొడ‌వ కంటే ముందు టాలీవుడ్ డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ‌తో ధృవ్ విక్ర‌మ్‌కు ఏర్ప‌డిన‌ విభేదాలు త‌మిళ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ర‌కు వెళ్లాయి. ర‌మేష్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తాన‌ని ధృవ్ విక్ర‌మ్ మాటిచ్చాడు. సినిమా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.కోటి రూపాయ‌ల రెమ్యూన‌రేష‌న్‌ను అడ్వాన్స్‌గా ధృవ్‌కు మేక‌ర్స్ ఇచ్చారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేయ‌డ‌మే కాకుండా కొన్ని సెట్స్ కూడా వేశారు. షూటింగ్ మొద‌ల‌య్యే టైమ్‌లో మేక‌ర్స్ చెప్ప‌కుండా సినిమా నుంచి ధృవ్ విక్ర‌మ్ త‌ప్పుకున్నాడు. ర‌మేష్ వ‌ర్మ మూవీ స్థానంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ తో మ‌రో మూవీ క‌మిట‌య్యాడు.

ఛాంబ‌ర్‌లో కంప్లైంట్‌...

ధృవ్‌ విక్ర‌మ్ వ‌ల్ల త‌మ‌కు చాలా న‌ష్టం జ‌రిగిందంటూ ర‌మేష్ వ‌ర్మ మూవీ టీమ్ త‌మిళ ఫిల్మ్ ఛాంబ‌ర్‌ను ఆశ్ర‌యించారు. ఈ వివాదం పెద్ద‌ది కావ‌డంతో ఈ కోలీవుడ్ హీరో దిగొచ్చారు. ర‌మేష్ వ‌ర్మ‌తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు. అక్టోబ‌ర్ నుంచి ధృవ్ విక్ర‌మ్, ర‌మేష్ వ‌ర్మ షూటింగ్ మొద‌లు కాబోతుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్‌గా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌...

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో ధృవ్ విక్ర‌మ్ ఓ సినిమా చేస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు జాకీ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు క‌ర‌ణ్ అర‌వింద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో హీరోల‌కు డూప్‌గా క‌నిపించే స్టంట్ మాస్ట‌ర్‌గా ధృవ్ విక్ర‌మ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ 13న ఈ మూవీ టైటిల్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేయ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement