త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhee Dancer Raju Arrested | పెళ్లి పేరుతో దారుణ మోసం.. కటకటాల పాలైన ‘ఢీ’ డ్యాన్సర్ రాజు

పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా వాడుకోవడమే కాకుండా లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ 'ఢీ' డ్యాన్సర్ రాజుపై ఓ యువతి మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

J

Entertainment | Published On Sep 12, 2026, 6.23 pm IST

Dhee Dancer Raju Arrested | పెళ్లి పేరుతో దారుణ మోసం.. కటకటాల పాలైన ‘ఢీ’ డ్యాన్సర్ రాజు

సంక్షిప్త సారాంశం

లైంగిక వేధింపులు, చీటింగ్ కేసులో పాపులర్ టీవీ షో 'ఢీ' డ్యాన్సర్ రాజును మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఓ బొటిక్ నిర్వాహకురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన వద్ద నుంచి సుమారు రూ. 12,00,000 తీసుకుని వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి, రాజును కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది.

Advertisement

Dhee Dancer Raju Arrested | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు (Dancer Raju) అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకుని దారుణంగా మోసం చేశాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో (Miyapur PS) సెప్టెంబర్ 9న ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది.

పరిచయం.. ప్రేమ.. మోసం

పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు కాపీ ప్రకారం.. మియాపూర్‌లో ఆ యువతి బొటిక్ (Boutique) నడుపుతోంది. అదే బిల్డింగ్‌లో మూడో అంతస్తులో 'ఢీ' ఫేమ్ చిట్టి మాస్టర్ డ్యాన్స్ స్టూడియో ఏర్పాటు చేశారు. డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం ఢీ-20 విన్నర్ రాజు అక్కడికి తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, తాను పెళ్లి చేసుకుంటానని రాజు ఆమెను నమ్మించాడు.

మే 2026లో తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి రాత్రి సమయంలో ఆమె బొటిక్‌కు వచ్చిన రాజు.. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని మాయమాటలు చెప్పి ఆమెతో శారీరకంగా కలిశాడు. ఆ తర్వాత వివిధ అవసరాల నిమిత్తం సుమారు రూ. 12,00,000 నగదును ఫోన్ పే (PhonePe), క్యాష్ రూపంలో బాధితురాలి నుంచి తీసుకున్నాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా చెల్లి పెళ్లి అయ్యాక చేసుకుందాం అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. బాధితురాలి ఇంట్లో, ఆఫీస్‌లో పలుమార్లు శారీరకంగా కలిసిన రాజు.. చివరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పెళ్లికి నిరాకరించాడు.

పోలీసుల ఎంట్రీతో జైలుకు..

తన వద్ద తీసుకున్న డబ్బులతో రాజు వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడని, తనలాగే మరికొంతమందిని కూడా మోసం చేశాడని బాధితురాలికి తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె వెంటనే మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. సెప్టెంబర్ 9న సాయంత్రం 4 గంటలకు కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు.. క్రైమ్ నెంబర్ 1307/2026 కింద 69 BNS, 318(4) సెక్షన్ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ లైంగిక వేధింపులు, చీటింగ్ కేసులో రాజును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు.

Advertisement
Advertisement