Akbaruddin Owaisi | ఆ కంపెనీ చాలా లక్కీ.. అన్ని కాంట్రాక్టులు దానికే దొరుకుతయ్
Akbaruddin Owaisi | హైదరాబాద్‌లో రూ.1400 కోట్ల అండర్‌గ్రౌండ్ కేబులింగ్ కాంట్రాక్ట్ ఒక్కటే కంపెనీకి ఇచ్చారని.. ఆ కంపెనీ చాలా లక్కీ కంపెనీ అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- ఫీజు బకాయిలు లేవంటరు.. కానీ ఆ కాంట్రాక్టర్‌కు టైంకు డబ్బులిస్తరు
- అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
Akbaruddin Owaisi | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో రూ.1400 కోట్ల అండర్‌గ్రౌండ్ కేబులింగ్ కాంట్రాక్ట్ ఒక్కటే కంపెనీకి ఇచ్చారని.. ఆ కంపెనీ చాలా లక్కీ కంపెనీ అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పైగా అన్ని కాంట్రాక్టులు ఆ కంపెనీకే దొరుకుతాయన్నారు. ఫీజు బకాయిలు, రైతుల కోసం ఖజానాలో డబ్బులు లేవని చెప్తారని.. కానీ ఆ కాంట్రాక్టర్‌కు టైంకు డబ్బులు ఇస్తారని చెప్పారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. ఆయన ప్రస్తావించిన కంపెనీ పేరు మాత్రం వెల్లడించలేదు.
ఆ కంపెనీ బీజేపీకి కూడా డబ్బులు ఇస్తుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, రైతుల కోసం, ప్రజల కోసం అయితే ఖజానాలో డబ్బులు లేవని అంటారు. కానీ ఆ కాంట్రాక్టర్‌కు మాత్రం కరెక్ట్ టైంకి డబ్బులు ఇస్తారు. ఆ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని బిల్లులు విడుదల చేశారో ఆర్‌టీఐ (RTI)లో అడిగినా ఇవ్వడం లేదు. రూ.1400 కోట్ల కాంట్రాక్ట్ ఆ పెద్ద కంపెనీకే ఇచ్చే బదులు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చు కదా? వాళ్లు కూడా బతకాలి కదా.
జీహెచ్ఎంసీ విభజన కారణమేంటో చెప్పలే..
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు అసలు కారణం ఏంటో చెప్పలేదు. ఉన్న జీహెచ్ఎంసీలోనే ఉద్యోగుల కొరత ఉంది. వేతనాలు సరిపోవట్లేదు అంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మూడు కార్పొరేషన్లకు ఉద్యోగులు ఎంత మంది కావాలి, అంత మందిని ఎలా తెస్తారు? అని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Komatireddy Venkatreddy | నాగ్‌పూర్ - విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణ పూర్తి
- ●Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ - ఫొటోల వెనకున్న అసలు కథ ఇదేనా?
- ●హైదరాబాద్‌కు ‘CURE’ మందా.. సామాన్యుడి జేబుకు చిల్లా?
- ●New Delhi Declaration | భారత్ దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు బ్రిక్స్ దేశాల ఏకగ్రీవ ఆమోదం
- ●Telangana | తెలంగాణ భాష కేవలం ఒక్క భాష మాత్రమే కాదు.. ప్రజల జీవన విధానం కూడా
- ●Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..

Komatireddy Venkatreddy | నాగ్‌పూర్ - విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణ పూర్తి

Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ - ఫొటోల వెనకున్న అసలు కథ ఇదేనా?

హైదరాబాద్‌కు ‘CURE’ మందా.. సామాన్యుడి జేబుకు చిల్లా?

New Delhi Declaration | భారత్ దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు బ్రిక్స్ దేశాల ఏకగ్రీవ ఆమోదం




