త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్

బీజింగ్‌లో జరిగిన CIFTIS ప్రదర్శనలో ఆరోవానా చేపను పోలిన ఒక రోబోట్ ఫిష్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న ఈ వీడియో వైరల్‌గా మారింది.

J

Viral news | Published On Sep 12, 2026, 6.49 pm IST

Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్
Advertisement
  • చైనాలోని బీజింగ్‌లో జరిగిన CIFTIS ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బయోనిక్ రోబోట్ చేప
  • చూసేందుకు ఎంతో అందంగా ఉండే 'ఆరోవానా' (Arowana) చేప ఆకారం, ఈదే శైలి ఆధారంగా దీని రూపకల్పన
  • ఫ్లూయిడ్ సిమ్యులేషన్ టెక్నాలజీ సాయంతో నీటిలో ఎంతో సహజంగా ఈదుతున్న వైనం
  • ఇది రోబో అని గుర్తుపట్టడం దాదాపు అసాధ్యం అంటున్న టెక్ నిపుణులు

Bionic Robot Fish | త్రినేత్ర.న్యూస్ : మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తోంది. తాజాగా చైనాలోని బీజింగ్‌లో జరిగిన CIFTIS (చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్) ప్రదర్శనలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. చూసేందుకు అచ్చం నిజమైన చేపలా కనిపిస్తున్న ఒక బయోనిక్ రోబోట్ ఫిష్ (Bionic fish robot) అక్కడికి వచ్చిన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఆరోవానా చేపను పోలి..

ఈ రోబోను ఎంతో పాపులర్ అయిన 'ఆరోవానా' (Arowana) చేప ఆకారం, దాని ఈదే శైలి (Swimming style) ఆధారంగా రూపొందించారు. ఇందులో అత్యాధునిక ఫ్లూయిడ్ సిమ్యులేషన్ టెక్నాలజీని (Fluid simulation tech) ఉపయోగించారు. దీనివల్ల ఈ రోబోట్.. నీటిలో ఎంతో స్మూత్‌గా, ఎంతో గ్రేస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తుంది. నిజమైన ఆరోవానా చేపకు ఎలాంటి కదలికలు ఉంటాయో, ఈ రోబో కూడా అచ్చం అలాగే కదులుతూ నెటిజన్లను కట్టిపడేస్తోంది.

గుర్తుపట్టడం అసాధ్యం..

ఈ రోబోట్ ఫిష్ నీటిలో ఈదుతున్న తీరు చూస్తే.. అది బ్యాటరీలతో నడిచే రోబో అని ఎవరూ ఊహించలేరు. దాన్ని చేతుల్లోకి తీసుకుంటే తప్ప.. నిజమైన చేపకు, దీనికి మధ్య తేడాను కనుక్కోవడం దాదాపు అసాధ్యం అని చెప్పాలి. ప్రస్తుతం ఈ బయోనిక్ చేపకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్‌గా (Viral) మారాయి. చైనా క్రియేటివిటీ, టెక్నాలజీ అద్భుతాన్ని చూసి టెక్ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement