త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana Trailer | విద్యార్థుల నిర‌స‌న‌ల ఎఫెక్ట్‌ – రామాయణ ట్రైలర్ వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా?

ర‌ణ‌భీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న‌ రామాయ‌ణ మూవీ ట్రైల‌ర్ శుక్ర‌వారం రిలీజ్ కావాల్సింది. కానీ స‌డెన్‌గా ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ క్యాన్సిల్ చేశారు. నీట్ పేప‌ర్ లీక్‌కు సంబంధించిన ఢిల్లీలో విద్యార్థులు చేస్తోన్న నిర‌స‌న‌ల వ‌ల్లే రామాయ‌ణ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ వాయిదాప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది

N

Entertainment | Published On Jul 24, 2026, 3.26 pm IST

Ramayana Trailer |   విద్యార్థుల నిర‌స‌న‌ల ఎఫెక్ట్‌ – రామాయణ ట్రైలర్ వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా?
Advertisement

Ramayana Trailer |  ర‌ణ‌భీర్ క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న రామాయ‌ణ మూవీ ట్రైల‌ర్ కోసం పాన్ ఇండియ‌న్ వైడ్‌గా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూశారు. శుక్ర‌వారం ఓ భారీ ఈవెంట్ ద్వారా ఈ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివ‌రి నిమిషంలో ట్రైల‌ర్ రిలీజ్‌పై వెన‌క్కి త‌గ్గారు. ఈ ఈవెంట్‌ను వాయిదా వేశారు. త్వ‌ర‌లోనే కొత్త విడుద‌ల తేదీని వెల్ల‌డిస్తామ‌ని అన్నారు. ఒకేసారి ఆరు భాష‌ల్లో రామాయ‌ణ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశార‌ట‌. ఆరు భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌, ఆర్ఆర్ వ‌ర్క్ కంప్లీట్ కాక‌పోవ‌డంతోనే ట్రైల‌ర్ విడుద‌ల‌ వాయిదాప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వాటితో పాటు సోనీ పిక్చ‌ర్స్ సంస్థతో కుదుర్చుకున్న డీల్ కూడా ఈ పోస్ట్‌పోన్‌కు ఓ కార‌ణ‌మ‌ని అంటున్నారు.

 గ‌ర్వ‌కార‌ణంగా...

ట్రైల‌ర్ పోస్ట్‌పోన్‌కు సంబంధించి రామాయ‌ణ నిర్మాత‌ న‌మిత్ మ‌ల్హోత్రా సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు. సోనీ పిక్చ‌ర్స్ భాగ‌స్వామ్యంతో రామ‌య‌ణాన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నాం. ఇండియ‌న్ సినిమాకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచేలా రామాయ‌ణాన్ని రూపొందిస్తున్నాం. హాలీవుడ్ సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ధీటుగా ఉంటుంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజ్ డేట్‌ను వెల్ల‌డిస్తా అని అన్నారు. అంతే కాకుండా "దేశ యువతే మన భవిష్యత్తు. మన భవిష్యత్తును కాపాడుకోవడానికి కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది అంటూ ఈ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

నిర‌స‌న‌ల వ‌ల్లే...

ఈ ట్రైల‌ర్ రిలీజ్ వాయిదాకు టెక్నిక‌ల్ వ‌ర్క్ ఆల‌స్యం కార‌ణం కాద‌ట‌. నీట్ పేప‌ర్ లీక్‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ సార‌థ్యంలో ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద‌ విద్యార్థులు చేస్తోన్న నిర‌స‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకొని మేక‌ర్స్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసిన‌ట్లు స‌మాచారం.

రామాయ‌ణ మేక‌ర్స్ సైలెంట్‌...

విద్యార్థుల పోరాటానికి సల్మాన్ ఖాన్, అలియా భట్, కరీనా కపూర్, హృతిక్ రోషన్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ స్టార్స్ మ‌ద్ద‌తు ఇచ్చారు. కానీ రామాయ‌ణ‌లో న‌టిస్తోన్న ర‌ణ‌భీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి, య‌శ్‌తో పాటు మిగిలిన యాక్ట‌ర్లు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేస్తే నిర‌స‌న‌ల ఎఫెక్ట్ సినిమాపై ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని భావించిన మేక‌ర్స్ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను చివ‌రి నిమిషంలో ఆపేసిన‌ట్లు స‌మాచారం. ఇన్‌డైరెక్ట్‌గా ప్రొడ్యూస‌ర్ రిలీజ్ చేసిన ప్ర‌క‌ట‌న‌లోనే ఈ హింట్ ఇచ్చేశారు. అయితే నీట్ పేప‌ర్ లీక్‌, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ పేర్ల‌ను మాత్రం పేర్కొన‌లేదు.

కొత్త సినిమాల‌పై...

విద్యార్థ‌ల నిర‌స‌న‌ల ప్ర‌భావం ఈ వారం రిలీజైన కొత్త సినిమాల‌పై కూడా ప‌డిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. కాజ‌ల్ అగ‌ర్వాల్ ది ఇండియ‌న్ స్టోరీతో పాటు మ‌రికొన్ని కొత్త సినిమాల‌కు ఫ‌స్ట్ డే ఆడియెన్స్ లేక థియేట‌ర్లు ఖాళీగా క‌నిపించాయి.రామాయ‌ణ మూవీలో క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ రావ‌ణాసురుడిగా న‌టిస్తోన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్‌, ద‌క్షిణాది సీనియ‌ర్ యాక్ట‌ర్లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement