త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devi Sri Prasad | ఎల్లమ్మ సినిమా చేయ‌డానికి స్ఫూర్తి ఇదే – వీడియో షేర్ చేసిన దేవిశ్రీప్ర‌సాద్‌

బ‌ల‌గం వేణు డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న ఎల్ల‌మ్మ మూవీతో మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఎల్ల‌మ్మ సినిమా అంగీక‌రించ‌డానికి స్ఫూర్తి ఇదే అంటూ ఓ వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు దేవిశ్రీప్ర‌సాద్‌.

N

Entertainment | Published On May 26, 2026, 7.25 pm IST

Devi Sri Prasad | ఎల్లమ్మ సినిమా చేయ‌డానికి స్ఫూర్తి ఇదే – వీడియో షేర్ చేసిన దేవిశ్రీప్ర‌సాద్‌
Advertisement

Devi Sri Prasad | టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్, రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఎల్ల‌మ్మ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. బ‌ల‌గం ఫేమ్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించ‌బోతున్నారు. వెనుక‌బ‌డిన డ‌ప్పు క‌ళాకారుడి జీవితం నేప‌థ్యంలో రా అండ్ ర‌స్టిక్ మూవీగా ఎల్ల‌మ్మ తెర‌కెక్క‌బోతున్న‌ది. ఈ సినిమాలో సామాజిక అంత‌రాల‌తో పాటు మైథ‌లాజిక‌ల్ పాయింట్‌ను ట‌చ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఎల్ల‌మ్మ షూటింగ్ జ‌రుగుతోంది.

వీడియో...

తాజాగా ఎల్ల‌మ్మ‌ సినిమా చేయ‌డానికి త‌న స్వ‌గ్రామం వెదురుపాక కార‌ణ‌మ‌ని దేవిశ్రీప్ర‌సాద్ చెప్పారు. స్వ‌గ్రామంలో జ‌రిగిన ఓ జాత‌ర‌లో భాగ‌మైన వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు.
జాతర సందర్భంగా తన స్వగ్రామంలో ఇంటిని సందర్శించిన దేవిశ్రీ ప్రసాద్ గ్రామస్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వేడుకల్లో ఉత్సాహంలో భాగమయ్యారు. పుట్టిన ఊరి జ్ఞాపకాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.

వెదురుపాక‌...

ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “మా నాన్న పుట్టిన ఊరు వెదురుపాక. ప్రకృతిని, గ్రామీణ జీవన సౌందర్యం తాలూకు అనుభూతిని ప్ర‌త్య‌క్షంగా మాకు ప‌రిచ‌యం చేయాలనే చెన్నై నుంచి తరచుగా నాన్న‌ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారు. మా మూలాల‌తో, మనుషులతో అనుబంధం కొనసాగాలని ఇక్కడే ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నాం. సంస్కృతి, జానపద కళలు, దైవత్వం ఎంత అందమైనవో నాకు నేర్పిన ఊరు ఇదే. ఆ అనుభూతులే నేను ‘ఎల్లమ్మ’ సినిమా చేయడానికి స్ఫూర్తినిచ్చాయి అంటూ ఈ వీడియోలో దేవిశ్రీప్ర‌సాద్ పేర్కొన్నారు.

ఐదు భాష‌ల్లో రిలీజ్‌...

ఈ వీడియోకు ఎల్ల‌మ్మ గ్లింప్స్ మ్యూజిక్‌ను జోడించారు. దేవిశ్రీప్ర‌సాద్ షేర్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎల్ల‌మ్మ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎల్ల‌మ్మ‌లో హీరోగా న‌టిస్తూనే ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు దేవిశ్రీప్ర‌సాద్‌.

Advertisement
Advertisement