Kollywood | తమిళంలోకి రీమేక్ అవుతోన్న నాని కోర్ట్ మూవీ – హీరోయిన్‌గా దేవయాని కూతురు
నాచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ మూవీ తమిళంలోకి రీమేక్ అవుతోంది. రంజన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో సుస్వాగతం ఫేమ్ దేవయాని కూతురు ఇనియా హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
Entertainment | Published On Apr 6, 2026, 4.05 pm IST
Kollywood | నాచురల్ స్టార్ నాని నిర్మాతగా రూపొందిన తెలుగు మూవీ కోర్ట్ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో లీగల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 58 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. గత ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కోర్ట్ మూవీలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించారు.
కోలీవుడ్‌లోకి...
తాజాగా కోర్ట్ మూవీ తమిళంలోకి రీమేక్ కాబోతుంది. రంజన్ ది అడ్వకేట్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నాడు. సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
దేవయాని కూతురు...
రంజన్ మూవీతో సీనియర్ హీరోయిన్ దేవయాని కూతురు ఇనియా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దేవయాని తెలుగులో సుస్వాగతం, మాణిక్యం వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె వారసురాలిగా రంజన్ మూవీతో ఇనియా కథానాయికగా తమిళ సినీ పరిశ్రమలోకి తొలి అడుగు వేయబోతున్నది. తెలుగులో శ్రీదేవి పోషించిన జాబిలి పాత్రలో ఇనియా కనిపించబోతున్నది.
రంజన్ మూవీ ఓపెనింగ్ వేడుకల్లో తల్లి దేవయానితో కలిసి ఇనియా పాల్గొన్నది. ఇనియాకు జోడిగా నిర్మాత కథిరేసన్ కొడుకు హరి ఈ సినిమాలో నటిస్తున్నాడు.
తొలిముద్దు...
తెలుగులో ప్రియదర్శి చేసిన లాయర్ పాత్రను తమిళంలో ప్రశాంత్ చేస్తోన్నారు. సోమవారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
తమిళంలో 1990 దశకంలో కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగారు ప్రశాంత్. ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. తెలుగులో తొలి ముద్దు, లాఠీతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
సంబంధిత వార్తలు

Trisha | సూర్య, త్రిష మధ్య విభేదాలు? – చెన్నై క్వీన్‌ను అవమానించారంటూ ఫ్యాన్స్ ఫైర్
మే 18, 2026

Jananayagan OTT | జననాయగన్ ఓటీటీ డీల్…. అప్పుడు 120 కోట్లు – ఇప్పుడు 50 కోట్లు – లీక్ ఎఫెక్ట్
మే 2, 2026

Suhas | కోలీవుడ్ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ హీరో – 75 కోట్ల బడ్జెట్‌తో డెబ్యూ మూవీ
ఏప్రిల్ 25, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



