త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaishnavi Chaitanya | ప్రొడ్యూస‌ర్‌గా మారిన అఖిల్ హీరోయిన్ – బేబీ బ్యూటీతో త‌మిళ సినిమా

బేబీ హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. కోలీవుడ్ హీరో ఆర్య‌తో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోంది. ఈ సినిమాను ఆర్య వైఫ్‌, అఖిల్ అక్కినేని డెబ్యూ మూవీ హీరోయిన్ స‌యేషా సైగ‌ల్ నిర్మించ‌బోతుంది.

N

Entertainment | Published On Jun 7, 2026, 3.36 pm IST

Vaishnavi Chaitanya | ప్రొడ్యూస‌ర్‌గా మారిన అఖిల్ హీరోయిన్ – బేబీ  బ్యూటీతో త‌మిళ సినిమా
Advertisement

Vaishnavi Chaitanya |  సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్ నుంచి బేబీ మూవీతో హీరోయిన్‌గా మారింది వైష్ణ‌వి చైత‌న్య‌. తొలి సినిమాలోనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌తో ఆద‌ర‌గొట్టింది. చిన్న సినిమాగా రూపొందిన బేబీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా వంద కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. బేబీ హిట్‌తో టాలీవుడ్‌లో బిజీగా మారింది వైష్ణ‌వి చైత‌న్య‌. తాజాగా ఈ అమ్మ‌డు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఈ త‌మిళ డెబ్యూ మూవీ షూటింగ్‌ను సైలెంట్‌గా ఫినిష్ కూడా చేసింది.

రొమాంటిక్ కామెడీ...

ఆర్య హీరోగా త‌మిళంలో రొమాంటిక్ కామెడీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు నిఖిల్ ముర‌ళీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను హీరో ఆర్య వైఫ్ స‌యేషా సైగ‌ల్ నిర్మిస్తోంది. ఈ రొమాంటిక్ మూవీ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు వైష్ణ‌వి చైత‌న్య స్వ‌యంగా ప్ర‌క‌టించింది. సినిమా తాలూకు కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

గ్లామ‌ర‌స్‌గా...

ఈ త‌మిళ మూవీలో వైష్ణ‌వి చైత‌న్య‌తో పాటు నిఖిల విమ‌ల్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఈ త‌మిళ సినిమాలో మోడ్ర‌న్ యువ‌తిగా గ్లామ‌ర‌స్ రోల్‌లో బేబీ హీరోయిన్ రోల్ సాగుతుంద‌ని అంటున్నారు.
ది షో పీపుల్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించిన స‌యేషా సైగ‌ల్ ఈ సినిమాతోనే నిర్మాత‌గా మారింది. స‌యేషా సైగ‌ల్ కెరీర్ తెలుగు ఇండ‌స్ట్రీతోనే మొద‌లైంది. అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన అఖిల్ మూవీలో స‌యేషా హీరోయిన్‌గా న‌టించింది. గ‌జ‌నీకాంత్ మూవీలో ఆర్య‌తో క‌లిసి న‌టించింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లోనే వీరిద్ద‌రి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది స‌యేషా సైగ‌ల్‌.
మ‌రోవైపు వైష్ణ‌వి చైత‌న్య ప్ర‌స్తుతం తెలుగులో ఏపిక్ మూవీ చేస్తోంది. బేబీ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య కాంబోలో రాబోతున్న ఈ మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Advertisement
Advertisement