Ponguleti Srinivas Reddy | సరిహద్దు పంచాదులుండొద్దిగ.. జాయింట్ సర్వే చేయండి
Ponguleti Srinivas Reddy | రెవెన్యూ, ఫారెస్ట్ భూమి సరిహద్దు వివాదాలు (Border Disputes) ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) సూచించారు.
- ఈ వివాదాల్లో ప్రజలు, రైతులు నష్టపోవొద్దు
- రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్: రెవెన్యూ, ఫారెస్ట్ భూమి సరిహద్దు వివాదాలు (Border Disputes) ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) సూచించారు. జాయింట్ సర్వేతో సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు, సర్వే, సెటిల్‌మెంట్ అధికారులతో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెండు విభాగాల సరిహద్దు వివాదాల వల్ల సామాన్య ప్రజలు, రైతులు ఏమాత్రం నష్టపోవొద్దు. రెండు విభాగాలు పూర్తి సమన్వయంతో జాయింట్ సర్వేలు నిర్వహించాలి. రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలి. ఈ సర్వేలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల సహాయంతో నిర్వహించి భూములకు స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలి.
శాస్త్రీయంగా సరిహద్దులను నిర్ధారించడం ద్వారా భవిష్యత్తులో తిరిగి ఎలాంటి వివాదాలు తలెత్తకుండా శాశ్వతంగా పరిష్కరించవచ్చు. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు అమలు చేస్తోంది. భూ రికార్డులలో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి దశాబ్దాల నాటి భూ వివాదాలకు తొందరగా పరిష్కారం చూపాలి.
ఈ సర్వేకు క్షేత్రస్దాయిలో రైతులు, ప్రజలు సహకరించాలి. జిల్లా, మండల స్జాయిలో రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో కమిటీలను ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలి అని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●2027 UP Assembly Elections | హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నికలకు బీజేపీ త్రిముఖ వ్యూహం
- ●Hyderabad Metro Phase-2 | మెట్రో ఫేజ్-2కు మహర్దశ.. రూ.125 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
- ●Amitabh Bachchan Lord Krishna Post | ఒక్క సైగ చేస్తే చాలు.. మీడియాకు బిగ్ బి స్ట్రాంగ్ వార్నింగ్!
- ●CBFC | సెన్సార్ రూల్స్ మరింత కఠినం - ఫిల్మ్ మేకర్స్‌కు షాకిచ్చిన సీబీఎఫ్సీ
- ●Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో భారీ ర్యాలీ.. గంటలోనే రూ.6 లక్షల కోట్ల లాభం.. కారణాలేమిటి..?
- ●Eight labourers died | రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో 8 మంది కూలీలు మృతి

2027 UP Assembly Elections | హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నికలకు బీజేపీ త్రిముఖ వ్యూహం

Hyderabad Metro Phase-2 | మెట్రో ఫేజ్-2కు మహర్దశ.. రూ.125 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

Amitabh Bachchan Lord Krishna Post | ఒక్క సైగ చేస్తే చాలు.. మీడియాకు బిగ్ బి స్ట్రాంగ్ వార్నింగ్!

CBFC | సెన్సార్ రూల్స్ మరింత కఠినం - ఫిల్మ్ మేకర్స్‌కు షాకిచ్చిన సీబీఎఫ్సీ






