త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | ఆగిపోయింద‌నుకున్న సినిమా సెట్స్‌పైకి – వ‌య‌సులో ఐదేళ్లు చిన్న హీరోతో పూజా హెగ్డే రొమాన్స్‌

త‌న‌కంటే వ‌య‌సులో ఐదేళ్లు చిన్న‌వాడైన హీరోతో జోడీక‌ట్ట‌బోతుంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. సునీల్ శెట్టి త‌న‌యుడు అహాన్ శెట్టి హీరోగా బాలీవుడ్‌లో సంకీ పేరుతో ఓ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ రూపొందుతోంది. అనౌన్స్‌చేసిన రెండేళ్ల త‌ర్వాత ఈ హిందీ సినిమా షూటింగ్ మొద‌లైంది. సంకీలో అహాన్ శెట్టికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది.

N

Entertainment | Published On Oct 30, 2026, 5.47 pm IST

Pooja Hegde | ఆగిపోయింద‌నుకున్న సినిమా సెట్స్‌పైకి – వ‌య‌సులో ఐదేళ్లు చిన్న హీరోతో పూజా హెగ్డే రొమాన్స్‌
Advertisement

Pooja Hegde | బాలీవుడ్ సినిమాలో త‌న‌కంటే ఐదేళ్లు చిన్న‌వాడైన యంగ్‌ హీరోతో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే రొమాన్స్ చేయ‌బోతుంది. సీనియ‌ర్ యాక్ట‌ర్‌ సునీల్ శెట్టి త‌న‌యుడు అహాన్ శెట్టి హీరోగా సంకీ పేరుతో రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. 2024లో ఈ మూవీని అనౌన్స్‌చేశారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. షూటింగ్ కూడా మొద‌లుపెట్ట‌క‌పోవ‌డంతో సంకీ సినిమాను మేక‌ర్స్ ప‌క్క‌న‌పెట్టారంటూ ప్ర‌చారం జ‌రిగింది.

150 కోట్ల బ‌డ్జెట్‌...

ఆగిపోయింద‌నుకున్న ఈ మూవీ అనూహ్యంగా సెట్స్‌పైకి వ‌చ్చింది. శుక్ర‌వారం భోపాల్‌లో సంకీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో అహాన్ శెట్టితో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే పూజా హెగ్డే ఈ బాలీవుడ్ మూవీ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీకి టీనూ సురేష్ దేశాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

ఐదేళ్లు చిన్న‌వాడు...

సంకీలో హీరోగా న‌టిస్తోన్న అహాన్ శెట్టి కంటే పూజా హెగ్డే వ‌య‌సులో ఐదేళ్లు పెద్ద‌ది కావ‌డం గ‌మ‌నార్హం. అవ‌కాశాలు త‌గ్గ‌డంతోనే యంగ్ హీరోకు జోడీగా బుట్ట‌బొమ్మ న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సంకీ మూవీ వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.
కాగా శ్రీశ్రీ మూవీతో నాలుగేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌బోతుంది పూజా హెగ్డే. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. త‌మిళంలో కాంచ‌న 4లో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 

ట్యాగ్స్:

Action MoviesAhan ShettyBollywood MoviesBollywood NewsPooja HegdeRomantic ThrillerSanki MovieSuniel ShettyTinu Suresh DesaiUpcoming Movies
Advertisement
Advertisement