ప్రభాస్ కల్కి కంటే ముందు దీపికా పదుకొనే చేసిన తెలుగు మూవీ ఏదో తెలుసా?
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొనే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కల్కి మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది.
Entertainment | Published On Dec 6, 2025, 6.11 pm IST
దీపికా పదుకొనే
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొనే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
కల్కి మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. కల్కి 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే దీపికా పదుకొనేను మేకర్స్ పక్కనపెట్టారు. దీపికా పెట్టిన 8 అవర్స్ కండీషన్‌తో రెమ్యూనరేషన్ పరంగా చేసిన డిమాండ్లు ఇందుకు కారణమంటూ ప్రచారం జరిగింది. కల్కి కంటే ముందు ప్రభాస్ స్పిరిట్ నుంచి కూడా దీపికా తప్పుకుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలను ఈ బాలీవుడ్ బ్యూటీ వదులుకోవడంతో ఫ్యాన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.
కల్కి కంటే ముందు దీపికా పదుకొనే తెలుగులో ఓ సినిమా చేసింది. కెరీర్ ఆరంభంలో చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయిన రిలీజ్‌కు నోచుకోలేదు. ఒకప్పటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో 2009లో లవ్ 4 ఎవర్ పేరుతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కింది. రణదీప్, మృదుల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో దీపికా పదుకొనే ఓ స్పెషల్ సాంగ్‌తో పాటు కొన్ని సీన్లలో నటించింది. దీపికాపై స్పెషల్ సాంగ్‌ను గ్రాండ్‌గా షూట్ చేశారు. లవ్ 4 ఎవర్ షూటింగ్ పూర్తయినా సినిమా మాత్రం అనివార్య కారణాల వల్ల రిలీజ్ నోచుకోలేదు. 2009లోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన దీపికా పదుకొనే దాదాపు 15 ఏళ్ల తర్వాత కల్కి2 అడుగుపెట్టింది.
కల్కి 2, స్పిరిట్ సినిమాలను రిజెక్ట్ చేసిన దీపికా పదుకొనే ప్రస్తుతం హిందీలో షారుఖ్‌ఖాన్ తో కింగ్ సినిమా చేస్తుంది. షారుఖ్, దీపికా కాంబినేషన్‌లో వస్తోన్న ఆరవ మూవీ ఇది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీలో ఓ హారర్ మూవీకి కూడా దీపికా పదుకొనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కల్కి 2లో దీపికా పదుకొనే ప్లేస్‌లో ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లుగా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

NTR | ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం దేవుడిచ్చిన వరం.. పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్..
మే 20, 2026

Telugu OTT | ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజైన రెండు తెలుగు సినిమాలు …ఒకటి క్రైమ్ థ్రిల్లర్…మరోటి సైన్స్ ఫిక్షన్
మే 19, 2026

Bigg Boss Ayesha | హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



