Deepika Padukone | కల్కి కంటే ముందు పదహారేళ్ల క్రితమే తెలుగులో సినిమా చేసిన దీపికా పదుకొనే …కానీ
కల్కి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొనే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ పదకొండు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. కల్కి కంటే ముందే పదహారేళ్ల క్రితం దీపికా తెలుగులో ఓ సినిమా చేసింది.
Entertainment | Published On Jan 5, 2026, 7.47 pm IST
Deepika Padukone | గత కొన్నాళ్లుగా సినిమాల కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది దీపికా పదుకొనే. కల్కి 2 నుంచి దీపికా పదుకొనేను మేకర్స్ పక్కనపెట్టడం, ఎనిమిది గంటల రూల్ కారణంగా ఈ ముద్దుగుమ్మపై చాలానే ట్రోల్స్ వచ్చాయి. ఈ విమర్శలను ధీటుగానే ఎదుర్కొంది దీపిక.
కల్కి 2 నుంచి తప్పుకున్న దీపికా పదుకొనే...కొద్ది రోజులకే తెలుగులో అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో దీపికా పదుకొనే యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కల్కి 2 నుంచి దీపికా తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. చాలా మంది టాప్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.
కల్కి 2898 ఏడీలో సుమతి అనే పాత్రలో దీపికా కనిపించింది. తల్లిగా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించింది. కల్కి కథ మొత్తం దీపికా పాత్ర ప్రధానంగానే సాగుతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ 1100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. కల్కితోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
పదహారేళ్ల క్రితమే...
అయితే కల్కి కంటే ముందే దీపికా తెలుగులో ఓ సినిమా చేసింది. పదహారేళ్ల క్రితం నటించిన ఈ మూవీ రిలీజ్‌కు నోచుకోలేదు. అప్పటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జయంత్ సీ పర్జాన్జీ లవ్ 4 ఎవర్ పేరుతో 2009లో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని రూపొందించారు. రణదీప్, మృదుల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో దీపికా పదుకొనే స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో లవ్ 4 ఎవర్ షూటింగ్‌లో దీపికా పాల్గొన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ షూటింగ్ పూర్తయినా ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. అలా దీపికా పదుకొనే టాలీవుడ్ డెబ్యూ మూవీ ఆగిపోయింది. లవ్ 4 ఎవర్‌తో ఎంట్రీ ఇవ్వాల్సిన దీపికా పదహారేళ్ల తర్వాత కల్కితో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. అల్లు అర్జున్, అట్లీ మూవీతో పాటు హిందీలో షారుఖ్‌ఖాన్‌తో కింగ్ మూవీ చేస్తోంది దీపికా పదుకొనే.
సంబంధిత వార్తలు

Deepika Padukone | రష్మిక మందన్న సినిమాలో దీపికా పదుకొనే – బోల్డ్ రోల్‌తో సర్ప్రైజ్
ఏప్రిల్ 25, 2026

Deepika Padukone | అల్లు అర్జున్ రాకా నుంచి దీపికా పదుకొనే ఔట్ – రూమర్లలో నిజమెంత?
ఏప్రిల్ 23, 2026

Harnaaz Sandhu | మహావతార్‌లో మిస్ యూనివర్స్.. విక్కీ కౌశల్‌కు జోడీగా హర్నాజ్ సందు..!
ఏప్రిల్ 22, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



