Deepika Padukone | రెండోసారి తల్లయిన దీపికా పడుకోణ్ – పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ జంట రణవీర్‌సింగ్, దీపికా పడుకోణ్ తల్లిదండ్రులుగా మారారు. శనివారం పండంటి ఆడబిడ్డకు దీపికా జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను రణవీర్‌సింగ్, దీపికా పడుకోణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా ప్రకటించారు. ఓ చిన్నారి పాదముద్రతో కూడిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
Entertainment | Published On Sep 19, 2026, 7.39 pm IST
Deepika Padukone |బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణ్ రెండోసారి తల్లయ్యింది. శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దీపికా పడుకోణ్, రణవీర్‌సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా ప్రకటించారు. చిన్నారి పాదం గుర్తుతో కూడిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వెల్‌కమ్ బేబీ గర్ల్ అంటూ ఈ ఫొటోపై రాసి ఉంది. డేట్‌తో రణవీర్‌సింగ్, దీపికా పడుకోణ్‌తో పాటు వారి కూతురు దువా పేర్లు ఈ ఫొటోపై రాసి ఉన్నాయి. దీపికా, రణవీర్‌సింగ్‌లకు బాలీవుడ్ ప్రముఖలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతోన్నారు.
సిద్ధి వినాయక గుడి...
శుక్రవారం భర్త రణవీర్‌సింగ్‌తో కలిసి ముంబైలోని సిద్ధి వినాయక గుడిని దీపికా పడుకోణ్ దర్శించుకుంది. బేబీ బంప్‌తో ఆమె గుడిలో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత రోజే దీపికా పడుకోణ్ తల్లిగా మారింది.
అల్లు అర్జున్ రాకా...
రణవీర్ సింగ్‌ను ప్రేమించిన దీపికా పడుకోణ్ 2018లో అతడిని పెళ్లి చేసుకుంది. 2024లో వీరికి కూతురు దువా జన్మించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ రాకాతో పాటు షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాల్లో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ధురంధర్, ధురంధర్ 2 సినిమాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌ను అందుకున్నాడు రణవీర్‌సింగ్.
View this post on Instagram
తాజావార్తలు
- ●Street Vendors UPI Rules | చిరు వ్యాపారుల నెత్తిన యూపీఐ పిడుగు.. రూ.1 లక్ష దాటితే మర్చంటేనా?
- ●Kodada Mega Job Mela | కోదాడలో ఉద్యోగాల సునామీ: 350 కంపెనీలు.. 32 వేల మంది అభ్యర్థులు
- ●బి-ఫామ్‌తో దానం బుక్.. కండువా ఎమ్మెల్యేల సంగతేంటి?
- ●Danam Nagender | సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్
- ●Sobhita Dhulipala | నెగెటివ్ రోల్లో అక్కినేని కోడలు - తమిళ సినిమా కోసం డూప్ లేకుండా ఫైట్స్
- ●Ponguleti Srinivas Reddy | 44 కాలనీల్లో 22ఏ సమస్యను పరిష్కరించాం

Street Vendors UPI Rules | చిరు వ్యాపారుల నెత్తిన యూపీఐ పిడుగు.. రూ.1 లక్ష దాటితే మర్చంటేనా?

Kodada Mega Job Mela | కోదాడలో ఉద్యోగాల సునామీ: 350 కంపెనీలు.. 32 వేల మంది అభ్యర్థులు

బి-ఫామ్‌తో దానం బుక్.. కండువా ఎమ్మెల్యేల సంగతేంటి?

Danam Nagender | సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్






