Deepika Padukone | రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనే – ప్రెగ్నెన్సీ కిట్ ఫొటోతో స్వీట్ సర్ ప్రైజ్
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్‌సింగ్, దీపికా పదుకొనే గుడ్‌న్యూస్ వినిపించారు. రెండోసారి తాము తల్లిదండ్రులుగా మారబోతున్నట్లు ప్రకటించారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణవీర్, దీపికాలకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతోన్నారు.
Entertainment | Published On Apr 19, 2026, 12.09 pm IST
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గుడ్‌న్యూస్ వినిపించింది. మరోసారి తాను తల్లిగా మారబోతున్నట్లు ఆదివారం ప్రకటించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బాలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా వెలుగొందుతున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొనే 2018లో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పండటి ఆడబిడ్డకు దీపికా జన్మనిచ్చింది. కూతురుకు దువా అని పేరు పెట్టుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ పోస్ట్....
తాజాగా మరోసారి తాము పేరెంట్స్‌గా మారబోతున్నట్లు రణవీర్, దీపికా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో వారి కూతురు దువా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకొని ఉంది. ఆ కిట్‌లో పాజిటివ్ అని సింబల్ కనిపిస్తోంది. ఈ ఫొటోలో దువాను రణవీర్‌సింగ్ ఎత్తుకోగా...కూతురి చేతులను ప్రేమగా పట్టుకొని దీపికా కనిపిస్తోంది. ఈ పోస్ట్‌కు రెండు దిష్టి బొమ్మ ఎమోజీలను దీపికా జోడించింది. రణవీర్‌సింగ్, దీపికా పోస్ట్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంత హార్ట్ ఎమోజీ...
సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు రణవీర్‌సింగ్, దీపికా పదుకొనేలోకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. స్వీట్ సర్‌ప్రైజ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దువా అక్కగా ప్రమోషన్ పొందబోతుందని అంటున్నారు.
తెలుగులోసినిమాలు...
ప్రస్తుతం దీపికా పదుకొనే బాలీవుడ్‌తో పాటు తెలుగులో సినిమాలు చేస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రాకాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. హిందీలో షారుఖ్ ఖాన్‌తో కింగ్ సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో యాక్షన్ రోల్స్ చేస్తోంది.
బిగ్గెస్ట్ హిట్...
మరోవైపు ఇటీవలే ధురంధర్ 2తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు రణవీర్‌సింగ్. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1750 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. బాలీవుడ్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



