త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Darshan | క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్ బ‌ర్త్‌డే – ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టిన భార్య – కొత్త సినిమా అనౌన్స్‌

క‌న్న‌డ అగ్ర హీరో ద‌ర్శ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న భార్య విజ‌య‌ల‌క్ష్మి సోష‌ల్ మీడియాలో ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ వైర‌ల్ అవుతోంది. కాగా అభిమాని హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న ద‌ర్శ‌న్ ప్ర‌స్తుతం జైలులో ఉన్నారు.

N

Entertainment | Published On Feb 16, 2026, 3.39 pm IST

Darshan | క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్ బ‌ర్త్‌డే – ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టిన భార్య – కొత్త సినిమా అనౌన్స్‌
Advertisement

Darshan |అభిమాని హ‌త్య కేసులో క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్ ప్ర‌స్తుతం జైలులో ఉన్నారు. 2024లో రేణుకాస్వామి అనే అభిమానిని ద‌ర్శ‌న్‌, అత‌డి ప్రియురాలు ప‌విత్రా గౌడ‌తో పాటు వారి అనుచ‌రులు క‌లిసి హ‌త్య చేశార‌ని పోలీసులు కేసు న‌మోదు చేశారు. రేణుకాస్వామి హ‌త్య కేసులో ఏ1గా ప‌విత్రా గౌడ‌, ఏ2గా ద‌ర్శ‌న్‌పై పోలీసులు ఛార్జీషీటు ఓపెన్ చేశారు. రేణుకాస్వామి హ‌త్య కేసులో క‌ర్ణాట‌క హైకోర్టు ద‌ర్శ‌న్‌కు బెయిల్ మంజూరు చేయ‌డంతో జైలు నుంచి విడుద‌ల‌య్యారు. కానీ సుప్రీంకోర్టు ఈ బెయిల్‌ను ర‌ద్దు చేయ‌డంతో మ‌ళ్లీ ద‌ర్శ‌న్ జైలుకు వెళ్లాల్సివ‌చ్చింది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌న జైలులో రిమాండ్ ఖైదీగా ద‌ర్శ‌న్ కొన‌సాగుతోన్నారు.

ద‌ర్శ‌న్ భార్య పోస్ట్‌...

సోమ‌వారం ద‌ర్శ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌తో పాటు క‌న్న‌డ సినీ వ‌ర్గాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా అత‌డికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ప్ర‌తి పుట్టిన‌రోజును అభిమానుల స‌మక్షంలో గ్రాండ్‌గా జ‌రుపుకునేవారు ద‌ర్శ‌న్‌. కానీ ఈ సారి మాత్రం జైలు గోడ‌ల ఎలాంటి వేడుక‌లు లేకుండా ద‌ర్శ‌న్ బ‌ర్త్‌డే జ‌రుగ‌బోతుంది.
కాగా ద‌ర్శ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న విజ‌య‌ల‌క్ష్మి సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. "ప్రతి రోజును పండుగలా జరుపుకునే ప్రియ‌మైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది విజ‌య‌ల‌క్ష్మి. భ‌ర్త ద‌ర్శ‌న్‌, త‌న‌యుడు వినేష్‌ల‌తో క‌లిసి దిగిన ఓ పాత ఫొటోను అభిమానుల‌తో పంచుకుంది. విజ‌య‌ల‌క్ష్మి పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆమె పోస్ట్‌ను తెగ షేర్ చేస్తున్నారు.

కొత్త సినిమా అనౌన్స్‌...

ద‌ర్శ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న హీరోగా ఓ కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌న్ సోద‌రుడు, క‌న్న‌డ డైరెక్ట‌ర్ దిన‌క‌ర్ ప్ర‌క‌టించాడు. ద‌ర్శ‌న్ త్వ‌ర‌లోనే జైలు నుంచి రిలీజ‌వుతాడ‌నే న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌ని దిన‌క‌ర్ అన్నాడు. ద‌ర్శ‌న్ విడుద‌లైన వెంట‌నే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామ‌ని అన్నారు. ద‌ర్శ‌న్‌, దిన‌క‌ర్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన న‌వ‌గ్ర‌హ క‌న్న‌డంలో క‌ల్ట్ కాసిక్‌గా నిలిచింది.

Advertisement
Advertisement