త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pavithra Gowda | వేధింపులు భ‌రించ‌లేను.. బెయిల్ ఇవ్వ‌కుంటే విష‌మైనా ఇవ్వండి : ప‌విత్ర గౌడ‌

Pavithra Gowda | రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు పవిత్ర గౌడ జైల్లో తనకు ఎదురవుతున్న వేధింపులను కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చింది. పరప్పన అగ్రహార జైలులో నైజీరియా మహిళా ఖైదీలు తనను వేధిస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది బెంగళూరు సెషన్స్‌ కోర్టుకు తెలిపారు. ‘ఈ వేధింపులను ఆపలేకపోతున్నారు.. నాకు విషం ఇవ్వండి’ అంటూ పవిత్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు కోర్టుకు వివరించారు.

P

Entertainment | Published On Sep 23, 2026, 4.52 pm IST

Pavithra Gowda | వేధింపులు భ‌రించ‌లేను.. బెయిల్ ఇవ్వ‌కుంటే విష‌మైనా ఇవ్వండి : ప‌విత్ర గౌడ‌
Advertisement

Pavithra Gowda | రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు పవిత్ర గౌడ జైల్లో తనకు ఎదురవుతున్న వేధింపులను కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చింది. పరప్పన అగ్రహార జైలులో నైజీరియా మహిళా ఖైదీలు తనను వేధిస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది బెంగళూరు సెషన్స్‌ కోర్టుకు తెలిపారు. ‘ఈ వేధింపులను ఆపలేకపోతున్నారు.. నాకు విషం ఇవ్వండి’ అంటూ పవిత్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు కోర్టుకు వివరించారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పవిత్ర గౌడ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. తనను ప్రత్యేక బ్యారక్‌కు తరలించాలని కోరినట్లు ఆమె తరఫు న్యాయవాదులు తెలిపారు. జైలు అధికారులు మరో బ్యారక్‌కు తరలించినా వేధింపులు ఆగలేదని పేర్కొన్నారు.

బెయిల్‌ ఇవ్వాలన్న న్యాయవాదులు

కేసు విచారణ ఆలస్యమవుతోందని, పవిత్ర ఇప్పటికే ఏడాదికిపైగా జైల్లో ఉన్నారని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఎక్కువ మంది సాక్షుల విచారణ పూర్తయిందని, కొద్దిమంది ప్రభుత్వ సాక్షులు మాత్రమే మిగిలారని తెలిపారు. వృద్ధురాలైన తల్లి, పాఠశాలకు వెళ్లే కుమార్తె బాధ్యతలు పవిత్రపై ఉన్నాయని పేర్కొంటూ బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ప్రాసిక్యూషన్‌ మాత్రం బెయిల్‌ను వ్యతిరేకించింది. రేణుకాస్వామి హత్య కేసులో 60 మంది సాక్షుల విచారణను ఏడాదిలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ప్రభుత్వ న్యాయవాది ప్రసన్నకుమార్‌ తెలిపారు. సాక్షుల విచారణ పూర్తయ్యే వరకు నిందితులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయకూడదని పేర్కొన్నారు. పవిత్రకు కూడా ఈ ఆంక్ష వర్తిస్తుందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.

2024లో హ‌త్య‌

బెంగళూరుకు చెందిన రేణుకాస్వామి 2024లో హత్యకు గురయ్యారు. సోషల్‌ మీడియాలో పవిత్ర గౌడకు ఆయన పంపిన సందేశాలే హత్యకు కారణమని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో కన్నడ నటుడు దర్శన్‌, పవిత్ర గౌడతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు గతంలో మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో వారు తిరిగి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది.

Advertisement
Advertisement