జైలులో దర్శన్ – కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్- అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్
Entertainment | Published On Dec 7, 2025, 1.21 pm IST
కన్నడ హీరో దర్శన్
అభిమాని హత్యకేసులో కన్నడ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. కొన్ని నెలల క్రితం బెయిల్‌పై దర్శన్ బయటకు వచ్చాడు. కానీ సుప్రీంకోర్టు అతడి బెయిల్‌ను రద్ధు చేసి షాకిచ్చింది. రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్‌కు వీఐపీలా ట్రీట్ చేయడంపై కూడా సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది. బెయిల్ రద్దుతో మళ్లీ జైలుకు వెళ్లారు దర్శన్. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో రిమాండ్ ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నారు. జైలులో తనకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, కనీసం సెల్ నుంచి బయటకు కూడా పంపించడం లేదంటూ దర్శన్ విచారణలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు విషం ఇప్పించి చంపమంటూ దర్శన్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.
కాగా దర్శన్ నటించిన ది డెవిల్ మూవీ డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఓ స్టార్ హీరో జైలులో ఉండగా అతడి సినిమా థియేటర్లలో విడుదల కానుండటం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జైలులో ఉన్న హీరో ఈ సినిమా షూటింగ్ ఎలా చేశాడా అని సినీ లవర్స్ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యే సమయంలో ది డెవిల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 2024 మార్చిలో ది డెవిల్ షూటింగ్ మొదలైంది. రేణుకాస్వామి హత్య కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్శన్ అరెస్ట్ అయ్యాడు. అప్పటికే ది డెవిల్ చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది.
ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మిగిలిన షూటింగ్ చేశారు. ప్రమోషన్స్‌కు రెడీ అయ్యే టైమ్‌లోనే సుప్రీంకోర్టు అతడి బెయిల్‌ను రద్దు చేసింది. దాంతో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా మేకర్స్ ది డెవిల్ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
డెవిల్ మూవీ డిసెంబర్ 12న థియేటర్లలోకి రాబోతుంది. శనివారం నుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇరవై నాలుగు గంటలు కాకముందే ఇప్పటివరకు రెండున్నర కోట్ల వరకు బుకింగ్స్ జరిగాయి. ఈ ఏడాది అతి తక్కువ టైమ్‌లో హయ్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన కన్నడ మూవీగా ది డెవిల్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ది డెవిల్ మూవీకి ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. రచనా రాయ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో మహేష్ మంజ్రేకర్, అచ్యుత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం ది డెవిల్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ది డెవిల్ మూవీకి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Rukmini Vasanth | రుక్మిణి వసంత్‌ను అన్‌ఫాలో చేసిన కాంతార హీరో – విభేదాలే కారణమా?
మార్చి 28, 2026

kannada heroines | అసభ్యకర యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నారు – కన్నడ హీరోయిన్ల ఆగ్రహం
మార్చి 3, 2026

Darshan | కన్నడ హీరో దర్శన్ బర్త్‌డే – ఎమోషనల్ పోస్ట్ పెట్టిన భార్య – కొత్త సినిమా అనౌన్స్
ఫిబ్రవరి 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



