The Devil Review | ది డెవిల్ రివ్యూ – మర్డర్ కేసులో జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
మర్డర్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ అగ్ర హీరో దర్శన్ హీరోగా నటించిన కన్నడ మూవీ ది డెవిల్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Jul 20, 2026, 12.47 pm IST
The Devil Review | అభిమాని హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ అగ్ర హీరో దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లడానికి ముందు దర్శన్ ది డెవిల్ సినిమాలో నటించాడు. అతడు జైలులో ఉండగానే ఈ మూవీ గత ఏడాది థియేటర్లలో రిలీజైంది. ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రచనా రాయ్ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల జీ5 ఓటీటీలో రిలీజైన ది డెవిల్ మూవీ ఎలా ఉంది? ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీతో దర్శన్ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అంటే?
ధనుష్ వర్సెస్ కృష్ణ....
ముఖ్యమంత్రి రాజశేఖర్‌పై (మహేష్ మంజ్రేకర్) అవినీతి ఆరోపణలు వస్తాయి. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. తన సీఎం పదవిని కొడుకు ధనుష్‌కు (దర్శన్) అప్పగించాలని అనుకుంటాడు రాజశేఖర్. కానీ ధనుష్‌కు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి ఉండదు. తండ్రి అధికారం, డబ్బును అడ్డుపెట్టుకొని జల్సాలు చేస్తుంటాడు. కోపం, అహం ఎక్కువే. తన మాట కాదన్నవారిని చంపడానికి వెనుకాడడు. ధనుష్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా అతడు సీఎం కావడానికి అడ్డంకిగా మారుతుంది. సీఎం కొడుకు ధనుష్ పోలికలతోనే ఉన్న కృష్ణను (దర్శన్) అనుకోకుండా చూస్తాడు అనంత్ నంబియార్ (అచ్యుత్ కుమార్). మెస్ నడిపే కృష్ణ సినిమా హీరో కావాలని కలలు కంటుంటాడు. కృష్ణ యాక్టింగ్ పిచ్చిని అడ్డుపెట్టుకొని ధనుష్‌లా కొన్నాళ్లు నటిస్తే భారీగా డబ్బు ఇవ్వడమే కాకుండా హీరోను కూడా చేస్తానని అనంత్ అతడిని నమ్మిస్తాడు. ధనుష్ లా తన మంచి మనసుతో ప్రజలకు చేరువ అవుతాడు కృష్ణ. అదే టైమ్‌లో ఫారిన్ నుంచి నిజమైన ధనుష్ వస్తాడు. కృష్ణ ప్రేమించిన రుక్మిణిని (రచనా రాయ్) కిడ్నాప్ చేస్తాడు? ధనుష్ బారి నుంచి తన ప్రియురాలిని కృష్ణ ఎలా కాపాడుకున్నాడు? కృష్ణను ధనుష్‌లా నటించడానికి ఒప్పించిన ప్లాన్ వెనుక ఎవరున్నారు? కృష్ణ, ధనుష్‌లలో రాష్ట్రానికి సీఎం ఎవరు అయ్యారు? రాజశేఖర్ వేసిన ప్లాన్ ఎలా బెడిసికొట్టింది అన్నదే ఈ మూవీ కథ.
విలనిజం పీక్స్....
మంచి, చెడుల మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు ప్రకాష్ ది డెవిల్ మూవీని రూపొందించారు. కథ కంటే దర్శన్‌కు కన్నడ నాట ఉన్న మాస్ ఇమేజ్ మీదే డైరెక్టర్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ది డెవిల్ మూవీలో హీరో, విలన్ రెండు పాత్రల్లో దర్శన్ కనిపించాడు. సినిమాలో నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ ఎక్కువగా హైలైట్ అయ్యింది. విలనిజాన్ని పతాక స్థాయిలో పండించాడు దర్శన్. తక్కువ డైలాగ్స్‌తో డిఫరెంట్ మ్యానరిజమ్స్‌తో నెగెటివ్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు బాగుంది.
ట్విస్ట్‌లు అదుర్స్....
క్రూయల్ మెంటాలిటీ ఉన్న యువకుడిగా ధనుష్ పాత్రను పరిచయం చేసే సన్నివేశాలతోనే డెవిల్ మొదలవుతుంది. ఆ తర్వాత రాజశేఖర్‌కు పొలిటికల్‌గా ఎదురైన అడ్డంకులు.. నటుడు కావాలనే ప్రయత్నాల్లో ఉన్న కృష్ణ...రుక్మిణితో అతడి ప్రేమాయణంతో ఫస్ట్ హాఫ్ ఫ్లాట్‌గా సాగుతుంది. ధనుష్‌గా కృష్ణ ప్రజలకు చేరువ కావడం...అదే టైమ్‌లో అసలైన ధనుష్ ఎంట్రీ ఇచ్చే సీన్ నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ధనుష్ బారి నుంచి తన ప్రియురాలిని కాపాడుకోవడానికి కృష్ణ వేసే ఎత్తులు ఆకట్టుకుంటాయి. చివరలో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. అసలు ఈ డ్రామ వెనుక ఎవరున్నారన్నది రివీల్ చేస్తూ సినిమాను ఎండ్ చేశారు డైరెక్టర్.
గౌతమ్ నందా...జెంటిల్‌మన్...
ది డెవిల్ కోసం డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ పాతదే. ఈ కాన్సెప్ట్‌తో దక్షిణాదిలో చాలా సినిమాలొచ్చాయి. తెలుగులో గౌతమ్ నందా, నాని జెంటిల్‌మెన్ లాంటి సినిమాలకు దగ్గరగా డెవిల్ ఉంటుంది. దర్శన్ తప్ప మిగిలిన పాత్రలకు ప్రాధాన్యత తక్కువే. డ్యూయల్ రోల్‌లో దర్శన్ చూపించిన వేరియేషన్ మాత్రం బాగుంది. హీరోయిన్ రచనా రాయ్ ఓ పాటలతో గ్లామర్‌తో అదరగొట్టింది. అచ్యుత్ కుమార్, మహేష్ మంజ్రేకర్ నటన ఒకే.
జీ 5 ఓటీటీలో కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. దర్శన్ యాక్టింగ్ కోసం చూడొచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ – తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
జులై 25, 2026

Web Series | నీట్ పేపర్ లీక్‌పై వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?
జులై 24, 2026

Mrunal Thakur | 2022లో షూటింగ్ కంప్లీట్ – 2026లో రిలీజ్ – డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
జులై 21, 2026
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన



