త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమ‌ర్శ‌ల‌పై కృతి స‌న‌న్ కౌంట‌ర్‌..

Kriti Sanon | రక్షాబంధన్‌ సందర్భంగా నటించిన ప్రకటనలోని దుస్తులపై వచ్చిన విమర్శలకు బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ఘాటుగా స్పందించింది. పండగల స్ఫూర్తిని వస్త్రధారణతో ముడిపెట్టడం సరికాదని పేర్కొంది. మహిళల దుస్తుల ఆధారంగా వారి సంస్కృతి, సంప్రదాయాలపై తీర్పులు ఇవ్వడం ఎప్పటివరకు కొనసాగుతుందని ప్రశ్నించింది. ఇ

P

Entertainment | Published On Aug 25, 2026, 7.15 pm IST

Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమ‌ర్శ‌ల‌పై కృతి స‌న‌న్ కౌంట‌ర్‌..
Advertisement

Kriti Sanon | రక్షాబంధన్‌ సందర్భంగా నటించిన ప్రకటనలోని దుస్తులపై వచ్చిన విమర్శలకు బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ఘాటుగా స్పందించింది. పండగల స్ఫూర్తిని వస్త్రధారణతో ముడిపెట్టడం సరికాదని పేర్కొంది. మహిళల దుస్తుల ఆధారంగా వారి సంస్కృతి, సంప్రదాయాలపై తీర్పులు ఇవ్వడం ఎప్పటివరకు కొనసాగుతుందని ప్రశ్నించింది. ఇటీవల ఆభరణాల బ్రాండ్ గివా (GIVA) రూపొందించిన రక్షాబంధన్‌ యాడ్‌లో కృతి ఆఫ్‌వైట్‌ రంగు దుస్తుల్లో కనిపించింది. బ్రాలెట్‌ తరహా బ్లౌజ్‌, కేప్‌, డ్రేప్డ్‌ స్కర్ట్‌తో ఆమె కనిపించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. రక్షాబంధన్‌ వంటి సంప్రదాయ పండగకు సంబంధించిన ప్రకటనలో ఇలాంటి వస్త్రధారణ ఏంటంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. రక్షాబంధన్‌ అంటే కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య బంధం మాత్రమే కాదని.. పరస్పరం ఒకరికొకరు అండగా నిలిచే అనుబంధానికి ప్రతీక అని పేర్కొంది. తాను, తన సోదరి ప్రతి ఏడాది ఒకరికొకరు రాఖీ కట్టుకుంటామని తెలిపింది.

అన్న తనను రక్షించినట్లే తాము కూడా ఒకరినొకరు కాపాడుకోగలమనే నమ్మకం తమకుందని చెప్పింది. తమ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కోసం పరస్పరం ప్రార్థించుకుంటామని కృతి వెల్లడించింది. తమ పెంపుడు కుక్కలను కూడా కుటుంబంలో భాగంగానే భావిస్తామని.. వాటి కోసం కూడా ప్రార్థిస్తామని పేర్కొంది. మహిళ ఏం ధరిస్తుందనే అంశాన్ని ఆమె సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవానికి కొలమానంగా చూడటం సరికాదని కృతి స్పష్టం చేసింది. కాలానుగుణంగా సంప్రదాయ వస్త్రధారణలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని గుర్తుచేసింది. అలాంటప్పుడు మహిళల సంస్కృతిని కేవలం వారి దుస్తులను చూసి ఎందుకు నిర్ణయిస్తున్నారని ప్రశ్నించింది. ‘సంస్కృతి, సంప్రదాయాలు మహిళ హృదయంలో ఉంటాయి.. ఆమె దుస్తుల నెక్‌లైన్‌లో కాదు’ అంటూ విమర్శకులకు కృతి గట్టి సమాధానమిచ్చింది. ఇదిలా ఉంటే.. కృతి సనన్‌ వస్త్రధారణపై నటి, ఎంపీ కంగనా రనౌత్‌ కూడా స్పందించింది. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని చెబుతూనే.. కొన్ని సందర్భాల్లో తగిన పరిమితులను పాటించడం అవసరమని అభిప్రాయపడింది.

Advertisement
Advertisement