Tamannaah | హీరోతో గొడవలు – సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు – చిక్కుల్లో తమన్నా బాలీవుడ్ మూవీ?
రిలీజ్ ముగింట తమన్నా బాలీవుడ్ మూవీ చిక్కుల్లో పడింది. తమన్నా, సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న ది వాన్ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. విడుదలకు మరో నెల రోజులు ఉండగా... హీరోతో పాటు నిర్మాతలతో ఏర్పడిన క్రియెటివ్ డిఫరెన్సెస్ కారణంగా దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
Tamannaah | రిలీజ్ ముంగిట మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ మూవీ చిక్కుల్లో పడింది. హీరోతో పాటు ప్రొడ్యూసర్‌తో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా హీరోహీరోయిన్లుగా బాలీవుడ్‌లో ది వాన్ పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. టీవీఎఫ్ బ్యానర్‌తో కలిసి ఎక్తా కపూర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
సెప్టెంబర్‌లో రిలీజ్...
సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. రిలీజ్‌కు నెల రోజులు ఉందనగా ఈ సినిమా నుంచి డైరెక్టర్ తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీపక్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు పట్ల హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మేకింగ్ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో దీపక్ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు తెలిసింది. మేకర్స్‌పై లీగల్ ఫైట్‌కు సిద్ధమైనట్లు తెలిసింది.
హీరోనే డైరెక్టర్....
వాన్ మూవీని రీ షూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ దీపక్ స్థానంలో ఈ రీషూట్స్‌కు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా స్వయంగా దర్శకత్వం వహించబోతున్నట్లు చెబుతున్నారు. క్లైమాక్స్‌తో పాటు ప్రీ క్లైమాక్స్ పోర్షన్లను మళ్లీ కొత్తగా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ . ఎడిటింగ్‌లో చాలా మార్పులు చేర్పులు చేయనున్నారట. తమన్నా సీన్లను కూడా తగ్గించనున్నట్లు సమాచారం.
సినిమా వాయిదా....
సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రీషూట్స్ వల్ల వాయిదాపడనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్‌లో తిరిగి విజయాల బాట పట్టించే మూవీ అవుతుందని కలలు కన్నది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో రిలీజ్ విషయంలోనే ఇబ్బందులను ఎదుర్కొనడంతో మిల్కీ బ్యూటీ నిరాశలో మునిగినట్లు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kiara advani | నయనతార భర్త సినిమాను రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ – కోలీవుడ్ డెబ్యూ ఛాన్స్ మిస్
ఆగస్టు 25, 2026

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
ఆగస్టు 24, 2026

Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ – బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
- ●Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం



