త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్.. రేపు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | ఈ నెల 26న మిలాద్ ఉన్ న‌బీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఓల్డ్ సిటీలో శాంతి ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. శాంతి ర్యాలీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్ష‌ల‌తో పాటు మ‌ళ్లింపులు చేప‌ట్టిన‌ట్టు హైద‌రాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీసు క‌మిష‌న‌ర్ జోయల్ డేవిస్ ప్ర‌క‌టించారు.

S

Hyderabad | Published On Aug 25, 2026, 7.00 pm IST

Traffic Restrictions | వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్.. రేపు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 26న మిలాద్ ఉన్ న‌బీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఓల్డ్ సిటీలో శాంతి ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. శాంతి ర్యాలీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్ష‌ల‌తో పాటు మ‌ళ్లింపులు చేప‌ట్టిన‌ట్టు హైద‌రాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీసు క‌మిష‌న‌ర్ జోయల్ డేవిస్ ప్ర‌క‌టించారు. బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని వెల్ల‌డించారు.

శాంతి ర్యాలీ కొన‌సాగే మార్గాలివే..

  • ఫలక్‌నుమా నుండి చార్మినార్ మీదుగా వోల్టా హోటల్ వరకు
  • యాహియా పాషా దర్గా నుండి వోల్టా హోటల్ వరకు (తిరుగు ప్రయాణం కూడా)
  • మక్కా మసీదు నుండి నాంపల్లి హజ్ హౌస్ వరకు
  • మక్కా మసీదు నుండి వోల్టా హోటల్ వరకు
  • పత్తర్‌గట్టి నుండి అలీజా కోట్లా వరకు

ట్రాఫిక్ మళ్లింపులు / నిలిపివేసే జంక్షన్లు:

ప్రజా అవసరాల నిమిత్తం ర్యాలీ సాగే సమయంలో కింద పేర్కొన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించడం జరుగుతుంది:

1.ఫలక్‌నుమా, 2. ఇంజిన్ బౌలి, 3. నాగులచింత ఎక్స్ రోడ్, 4. హిమ్మత్‌పురా జంక్షన్, 5. వోల్గా, 6. హరిబౌలి, 7. పంచమొహల్లా, 8. చార్మినార్, 9. గుల్జార్ హౌస్, 10. పత్తర్‌గట్టి, 11. మదీనా జంక్షన్, 12. ఢిల్లీ గేట్, 13. నయాపూల్, 14. ఎస్.జె. రోటరీ జంక్షన్, 15. దారుల్ షిఫా, 16. పురానీ హావేలీ, 17. మీరాలం మండి, 18. ఏతేబార్ చౌక్, 19. అలీజా కోట్లా, 20. బీబీ బజార్, 21. వోల్టా హోటల్, 22. అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, 23. ఉస్మాన్‌గంజ్, 24. ఎంజే మార్కెట్ జంక్షన్, 25. తాజ్ ఐలాండ్, 26. నాంపల్లి టి జంక్షన్, 27. హజ్ హౌస్, 28. ఏఆర్ పెట్రోల్ పంప్ (నాంపల్లి).

వాహనదారులకు విజ్ఞప్తి:

బుధవారం ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు వాహనదారులు పైన పేర్కొన్న జంక్షన్లు, మార్గాలను త్యాగం చేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితులు లేదా ప్రయాణ సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చని తెలిపారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని జాయింట్ సీపీ కోరారు.

Advertisement
Advertisement