Malayalam OTT | ఓటీటీలోకి మైండ్ బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో రిలీజ్
కుంచకో బోబన్ హీరోగా నటించిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉన్మాదం కమర్షియల్‌గా పెద్ద హిట్టయ్యింది. డిఫరెంట్ అటెంప్ట్‌గా ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి సోనీలివ్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Aug 25, 2026, 6.47 pm IST
Malayalam OTT | కుంచకో బోబన్ హీరోగా నటించిన మలయాళం మూవీ ఉన్మాదం డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఆడియెన్స్‌ను మెప్పించింది. జై భీమ్ ఫేమ్ లిజోమోల్ జోస్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. జూలై నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కమర్షియల్ హిట్టుగా నిలిచింది.
ఐదు భాషల్లో...
ఉన్మాదం మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడన్నది రివీలైంది. సెప్టెంబర్ 4 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది.
ట్విస్ట్‌లు హైలైట్...
మిస్సింగ్ కేసులను సాల్వ్ చేసే క్రమంలో పోలీసుల ఇన్వేస్టిగేషన్ ఎలా ఉంటుంది? వృత్తి బాధ్యతల కారణంగా వ్యక్తిగత జీవితానికి టైమ్ కేటాయించలేక ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంటారనే పాయింట్‌కు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు కిరణ్ దాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. కుంచకోబోబన్ యాక్టింగ్‌తో పాటు ట్విస్ట్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
కానిస్టేబుల్ కథ...
షెల్లీ ఓ కానిస్టేబుల్. సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. కుటుంబబాధ్యతలు, భార్యతో ఉన్న గొడవల కారణంగా ఇష్టం లేకపోయినా కానిస్టేబుల్‌గా జాబ్ చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. అనుకోకుండా ఓ పాత మిస్సింగ్ కేసు ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యత షెల్లీపై పడుతుంది. ఆ కేసు షెల్లీ జీవితాన్ని ఎలాంటి మలుపుతిప్పింది? తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని అతడు ఎందుకు భ్రమపడ్డాడు? చివరకు ఏమైంది అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ – ఓటీటీలోకి వచ్చేస్తోన్న అలియాభట్ స్పై థ్రిల్లర్ మూవీ
ఆగస్టు 23, 2026

Taapsee | థియేటర్లలో కాదు…నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆగస్టు 21, 2026

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ – సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Japan companies in Telangana | అందుకే తెలంగాణ యువతకు జపనీస్ భాష, స్కిల్స్ నేర్పిస్తున్నాం
- ●TTD | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!
- ●CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..
- ●ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
- ●Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది
- ●Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు

Japan companies in Telangana | అందుకే తెలంగాణ యువతకు జపనీస్ భాష, స్కిల్స్ నేర్పిస్తున్నాం

TTD | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!

CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?



