TTD | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!
TTD | శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ నెల మాసానికి సంబంధించిన సేవా స్లాట్లను టీటీడీ రెండు విడతల్లో ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మోత్సవాల స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో విడతలో పది రోజుల చొప్పున సేవా స్లాట్లను కేటాయించారు.
Devotional | Published On Aug 25, 2026, 6.25 pm IST
TTD | శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ నెల మాసానికి సంబంధించిన సేవా స్లాట్లను టీటీడీ రెండు విడతల్లో ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మోత్సవాల స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో విడతలో పది రోజుల చొప్పున సేవా స్లాట్లను కేటాయించారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు, అక్టోబర్ 12 నుంచి 21 వరకు రెండు విడతల్లో బ్రహ్మోత్సవాల స్లాట్లు అందుబాటులో ఉంటాయి. శ్రీవారి చేయాలనే ఆసక్తి ఉన్న 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారే అర్హులు. అలాగే, అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల, తిరుపతిలో జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్‌లైన్ కోటాను 26న సాయంత్రం 4 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. జనరల్ సేవకు ఎంపికైన సేవకులు తిరుమల, తిరుపతిలో తమ సేవా బుకింగ్ తేదీనే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే, అక్టోబర్ 6 నుంచి 11 వరకు ఉన్న స్లాట్ ఆరు రోజులకే పరిమితమని టీటీడీ తెలిపింది. పరకామణి సేవకు ఎంపికైన సేవకులు తమ బుకింగ్ తేదీకి ఒక రోజు ముందుగానే తిరుమలలోని సేవా సదన్-2లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రిపోర్టింగ్ పూర్తి చేయాలని టీటీడీ సూచించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CS Jaju | ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..
- ●ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
- ●Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది
- ●Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు
- ●Tamannaah | హీరోతో గొడవలు - సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు - చిక్కుల్లో తమన్నా బాలీవుడ్ మూవీ?
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్మెంట్

CS Jaju | ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?

Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది

Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు





