Shriya Saran | రిలీజ్ కానీ సినిమాకు తమిళనాడు స్టేట్ అవార్డులు – శ్రియా మూవీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఇటీవల తమిళనాడు ప్రభుత్వం స్టేట్ ఫిల్మ్స్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో శ్రియా హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ మూవీ సందకారికి మూడు అవార్డులు ఇవ్వడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Entertainment | Published On Feb 2, 2026, 11.08 am IST
Shriya Saran | ఇటీవల తమిళనాడు ప్రభుత్వం స్టేట్ ఫిల్మ్ అవార్డులనుప్రకటించింది. 2016 నుంచి 2022 వరకు ఏడేళ్ల అవార్డుల విజేతలను ప్రకటించింది. ఈ స్టేట్ అవార్డుల్లో సూర్య, సాయిపల్లవి, కీర్తి సురేష్, ధనుష్, విజయ్ సేతుపతితో పాలు పలువురు స్టార్స్‌కు అవార్డులు దక్కాయి.
స్టేట్ అవార్డులపై ప్రశంసలతో పాటు విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఈ అవార్డుల్లో లాబీయింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిభావంతులను పక్కనపెట్టి తమకు కావాల్సిన వారికే ప్రభుత్వం అవార్డులను ప్రకటించినట్లు విమర్శలు వస్తున్నాయి.
మూడు అవార్డులు...
శ్రియా హీరోయిన్‌గా నటించిన సందకారి సినిమాను అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. తమిళనాడు స్టేట్ అవార్డుల్లో ఈ మూవీ మూడు పురస్కారాలను దక్కించుకుంది. 2020 ఏడాదికి గాను బెస్ట్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో సందకారికి అవార్డులను ప్రకటించడంపై సినీ లవర్స్ ఫైర్ అవుతున్నారు.
రిలీజ్ కాలేదు...
ఈ విమర్శల వెనుక పెద్ద ట్విస్ట్ ఉంది. సందకారి సినిమా అసలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. 2020లోనే షూటింగ్ పూర్తయినా అనివార్యకారణాల వల్ల అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. థియేటర్లలో రిలీజ్ కానీ సినిమాకు అవార్డులు ఎలా ఇస్తారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఇది తమిళ స్ట్రెయిట్ మూవీ కూడా కాదు. మలయాళ మూవీ మైబాస్‌కు రీమేక్‌గా సందకారి రూపొందింది. మలయాళ ఒరిజినల్ వెర్షన్‌ను ఓ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారు. స్ట్రెయిట్ సినిమాలను కాదని థియేటర్లలో రిలీజ్ కానీ ఓ రీమేక్ సినిమాకు బెస్ట్ మూవీగా ప్రభుత్వం పురస్కారం ఇవ్వడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. లాబీయింగ్ జరిగింది అనడానికి ఈ మూవీనే ఎగ్జాంపుల్ అని అంటున్నారు. నెటిజన్ల ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
మేడమ్...
సందకారి మూవీలో విమల్, శ్రియా హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రభు ఓ కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీకి ఆర్ మాదేశ్ దర్శకత్వం వహించాడు. ఈ తమిళ మూవీని మేడమ్ పేరుతో తెలుగులోకి డబ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సంబంధిత వార్తలు

Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ – జననాయగన్ సెన్సార్ కంప్లీట్ – మూడు గంటల రన్టైమ్తో రిలీజ్
జులై 9, 2026

OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ – ఏ ఓటీటీలో చూడాలంటే?
జులై 7, 2026

Thalapathy Vijay | దళపతి విజయ్ వర్సెస్ జాసన్ సంజయ్ – తండ్రీకొడుకుల బాక్సాఫీస్ ఫైట్
జులై 3, 2026
తాజావార్తలు
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్
- ●China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా

JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా



