త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nana Patekar | లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌తో అవ‌కాశాల‌కు దూరం – నానా ప‌టేక‌ర్ జీవితంలోని వివాదాలు

ఐదు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో అస‌మాన న‌ట‌న‌తో ఎన్నో పాత్ర‌ల‌కు ప్రాణం పోసిన బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ జీవితంలో వివాదాలు చాలానే ఉన్నాయి. హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా చేసిన‌ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల కార‌ణంగా నానా ప‌టేక‌ర్ మూడేళ్ల పాటు బాలీవుడ్‌కు దూర‌మ‌య్యారు. చాలా సినిమాల నుంచి ఆయ‌న్ని తొల‌గించారు.

N

Entertainment | Published On Oct 8, 2026, 11.00 am IST

Nana Patekar | లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌తో అవ‌కాశాల‌కు దూరం – నానా ప‌టేక‌ర్ జీవితంలోని వివాదాలు
Advertisement

Nana Patekar | బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు నానా ప‌టేక‌ర్ గురువారం ఉద‌యం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సీనియ‌ర్ న‌టుడి హ‌ఠాన్మ‌ర‌ణంతో బాలీవుడ్ వ‌ర్గాలు దిగ్భాంతికి లోన‌వుతున్నాయి. నానా ప‌టేక‌ర్‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్‌లు పెడుతోన్నారు.

హీరోగా....విల‌న్‌గా...

ఐదు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో హీరోగానే కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, క‌మెడియ‌న్‌గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించారు నానా ప‌టేక‌ర్‌. బాలీవుడ్‌తో పాటు మ‌రాఠీ, త‌మిళం, ఇంగ్లీష్ భాష‌ల్లో సినిమాలు చేశారు. నేష‌న‌ల్ అవార్డుతో పాటు అనేక పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్నారు.

వివాదాలు...

త‌న అస‌మాన న‌ట‌న‌తో ఎన్నో పాత్ర‌ల‌కు ప్రాణం పోసిన నానా ప‌టేక‌ర్ జీవితంలో వివాదాలు చాలానే ఉన్నాయి. హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా చేసిన లైంగిక ఆరోప‌ణ‌లు ఈ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడి కెరీర్‌లో మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయాయి. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన కూడా నానా ప‌టేక‌ర్‌పై విమ‌ర్శ‌లు చాలానే వ‌చ్చాయి.

హార్న్ ఒకే ప్లీజ్‌...

నానా ప‌టేక‌ర్ హీరోగా న‌టించిన హార్న్ ఒకే ప్లీజ్ సినిమా 2008లో రిలీజైంది. ఈ బాలీవుడ్ మూవీలో హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. ఈ సాంగ్ షూటింగ్‌లో నానా ప‌టేక‌ర్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, లైంగికంగా వేధింపుల‌కు గురిచేశార‌ని త‌నుశ్రీద‌త్తా ఆరోపించింది. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన ప‌దేళ్ల త‌ర్వాత 2018లో నానా ప‌టేక‌ర్‌పై త‌నుశ్రీ ద‌త్తా పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసు బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మీటూ ఉద్య‌మానికి దారితీసింది. ఈ లైంగిక ఆరోప‌ణ‌ల కేసులో నానా ప‌టేక‌ర్‌ను కోర్టు నిర్ధోషిగా ప్ర‌క‌టించింది. వేధింపుల‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవ‌ని పేర్కొన్న‌ది. కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ త‌నుశ్రీ ద‌త్తా ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. కానీ అక్క‌డ కూడా నానా ప‌టేక‌ర్‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. ఈ వివాదం కార‌ణంగా మూడేళ్ల పాటు బాలీవుడ్‌లో నానా ప‌టేక‌ర్‌కు ఒక్క అవ‌కాశం రాలేదు. హౌజ్‌ఫుల్ 4 సినిమా నుంచి ఆయ‌న్ని మేక‌ర్స్ ప‌క్క‌న‌పెట్టారు.
త‌న ముక్కుసూటిత‌నం, కోపం వ‌ల్ల షూటింగ్ మ‌ధ్య‌లో నుంచే నానా ప‌టేక‌ర్ త‌ప్పుకున్న సినిమాలు బాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి.

 

Advertisement
Advertisement