త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ త‌మిళ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లోయింగ్‌

ఓజీ ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా న‌టించిన త‌మిళ క్రైమ్ కామెడీ మూవీ కాన్ సిటీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. కాన్ సిటీ మూవీలో టాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Jul 20, 2026, 8.43 pm IST

OTT | ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ త‌మిళ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లోయింగ్‌
Advertisement

OTT |  ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా న‌టించిన కాన్ సిటీ గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైంది. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అన్నాబెన్‌, సాక్షి వైద్య హీరోయిన్లుగా న‌టించారు. హ‌రీస్ దురైరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో యోగిబాబు, వీటీవీ గ‌ణేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో....

థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న కాన్ సిటీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. త‌మిళంతో పాటు తెలుగు రిలీజ్ అవుతోంది.
శ‌ర‌వ‌ణ‌న్‌, మిత్రా భార్య‌భ‌ర్త‌లు. శ‌ర‌వ‌ణ‌న్ ఎల‌క్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తుంటాడు. అప్పుల భారం పెరిగి మోసాలు, స్కామ్‌లు చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. అత‌డికి భార్య మిత్రా కూడా స‌హ‌క‌రిస్తుంటుంది. భారీ మొత్తంలో డ‌బ్బు దోచుకోవ‌డానికి శ‌ర‌వ‌ణ‌న్‌, మిత్రా పెద్ద స్కెచ్ వేస్తారు. ఈ క్ర‌మంలోనే వారు అస‌లు భార్యాభ‌ర్త‌లు కాద‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. శ‌ర‌వ‌ణ‌న్ మిత్రా గ‌తం ఏమిటి? వారు ఎందుకు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ట్విస్ట్‌లు సూప‌ర్‌...

కాన్ సిటీలో అర్జున్ దాస్‌, అన్నాబెన్ యాక్టింగ్‌తో పాటు ట్విస్ట్‌లు బాగున్నాయంటూ కామెంట్లు వ‌చ్చాయి. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం సినిమా నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఐదు కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

తెలుగులో...

కాన్ సిటీలో హీరోయిన్‌గా న‌టించిన సాక్షి వైద్య తెలుగులో ఏజెంట్‌, గాంఢీవ‌ధారి అర్జున‌తో పాటు నారి నారి న‌డుమ మురారి సినిమాలు చేసింది. అన్నాబెన్ కూడా ప్ర‌భాస్ క‌ల్కిలో ఓ కీల‌క పాత్ర పోషించింది.
లోకేష్ క‌న‌గ‌రాజ్ ఖైదీ మూవీతో త‌మిళంలో న‌టుడిగా ఫేమ‌స్ అయిన అర్జున్ ...ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించాడు. ఓజీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

 

Advertisement
Advertisement