Vijay – Trisha | త్రిష సడెన్ ఎంట్రీ – ముఖం చాటేసిన విజయ్ – ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది?
లండన్‌లో జరిగిన మిచెలిన్ లీ మాన్స్ కప్ రేసింగ్ పోటీలో కోలీవుడ్ హీరో అజిత్ తన టీమ్‌తో కలిపి బరిలో దిగారు. ఈ రేసింగ్ ఈవెంట్‌కు తమిళనాడు సీఎం దళపతి విజయ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. విజయ్‌తో పాటు త్రిష కూడా ఈ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌కు అటెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు కలిసి రేసింగ్ పోటీలను వీక్షించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Sep 13, 2026, 12.15 pm IST
Vijay - Trisha | తమిళనాడు సీఎం దళపతి విజయ్, చెన్నై క్వీన్ త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. కోలీవుడ్ హీరో అజిత్ బరిలో నిలిచిన మోటార్ రేసింగ్ పోటీలకు త్రిషతో కలిసి విజయ్ అటెండ్ కావడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి రిలేషన్‌పై గత కొద్ది నెలలుగా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల నడుమ మళ్లీ జంటగా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చీఫ్ గెస్ట్...
శనివారం లండన్‌లో జరిగిన మిచెలిన్ లీ మాన్స్ కప్ రేజింగ్ గేమ్స్‌లో హీరో అజిత్ తన టీమ్‌తో కలిసి పోటీపడ్డారు. రేసింగ్ ఈవెంట్‌కు దళపతి విజయ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. గ్రీన్ ఫ్లాగ్ ఊపి గేమ్‌ను ప్రారంభించారు. అజిత్‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్నాయి.
లండన్‌లోనే త్రిష...
ఓ హారర్ మూవీ షూటింగ్ కోసం గత కొద్ది రోజులుగా లండన్‌లోనే ఉంటున్న త్రిష ఈ రేసింగ్ ఈవెంట్‌కు హాజరైంది. సీఎం దళపతి విజయ్‌తో కలిసి రేసింగ్ పోటీలను వీక్షించింది. వీఐపీ గ్యాలరీలో విజయ్, త్రిష జంటగా కనిపించారు. రేసింగ్ గేమ్ గురించి విజయ్ తన సన్నిహితులతో చెబుతుండగా...సడెన్‌గా త్రిష అక్కడికి వచ్చింది. ఆమె రాకతో విజయ్ ఇబ్బందిపడినట్లుగా కనిపించారు. ముఖం పక్కకుతిప్పుకున్నారు. వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. త్రిషతో కలిసి జంటగా కెమెరాల కంట పడకూడదనే విజయ్ ఇలా చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లండన్ ట్రిప్
ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వేడుకతో పాటు ప్రభుత్వ ఆధర్వంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు త్రిష అటెండ్ అయ్యింది. తాజాగా మరోసారి జంటగా అభిమానులకు వీరిద్దరు కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారని, పెళ్లిచేసుకోబోతున్నారంటూ గత ఏడాది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. లండన్ ట్రిప్‌తో ఈ రూమర్లు నిజమే కావచ్చునని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vinayaka Chavithi | గజముఖ గణపతి రూపాలెన్నో తెలుసా?.. ఒక్కో స్వరూపానికి ఒక్కో విశిష్ఠత..
- ●Robotic surgery workshop TIMS | రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ఎంతో సంతోషకరం: దామోదర రాజనర్సింహ
- ●Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
- ●Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..

Vinayaka Chavithi | గజముఖ గణపతి రూపాలెన్నో తెలుసా?.. ఒక్కో స్వరూపానికి ఒక్కో విశిష్ఠత..

Robotic surgery workshop TIMS | రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ఎంతో సంతోషకరం: దామోదర రాజనర్సింహ

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్

Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు






