త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cm Vijay | మ‌ళ్లీ కెమెరాముందుకు సీఎం విజ‌య్ .. కానీ ….

జ‌న‌నాయ‌గ‌న్ త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్ మ‌ళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. గౌత‌మ్ మీన‌న్ డైరెక్ష‌న్‌లో న‌టించ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ట్విస్ట్ ఏంటంటే?

N

Entertainment | Published On Nov 5, 2026, 4.47 pm IST

Cm Vijay | మ‌ళ్లీ కెమెరాముందుకు సీఎం విజ‌య్ .. కానీ ….
Advertisement

Cm Vijay |  త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి మూవీగా జ‌న‌నాయ‌గ‌న్ ఈ ఏడాది జూలైలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా భారీగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. జ‌న‌నాయ‌గ‌న్ షూటింగ్ త‌ర్వాత ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు విజ‌య్‌. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే పార్టీ ఘ‌న‌విజ‌యాన్ని సాధించింది. విజ‌య్ సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టారు.

కెమెరా ముందుకు...

ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌తో బిజీగా ఉన్న ద‌ళ‌ప‌తి విజ‌య్ మ‌ళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నాయి. అయితే సినిమాలో కాదు. ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వ పాల‌న‌లోని విజ‌యాల‌ను వివ‌రిస్తూ టీవీకే ప్ర‌భుత్వం ఓ షార్ట్‌ఫిల్మ్ చేయ‌బోతుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించనున్న‌ట్లు స‌మాచారం.

గౌత‌మ్ మీన‌న్‌...

ఈ షార్మ్ ఫిల్మ్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే బాధ్య‌త‌ల‌ను గౌత‌మ్ మీన‌న్‌కు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. ప‌లువురు కోలీవుడ్ టాప్ టెక్నీషియ‌న్లు ఈ ల‌ఘు చిత్రానికి ప‌నిచేయ‌నున్న‌ట్లు స‌మాచారం. గౌత‌మ్ మీన‌న్‌, రెహ‌మాన్‌తో పాటు మిగిలిన వారంద‌రూ విజ‌య్‌పై అభిమానంతో రెమ్యూన‌రేష‌న్ లేకుండా ఈ ల‌ఘు చిత్రానికి వ‌ర్క్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

రెండు రోజులు డేట్స్‌...

బై ఎలెక్ష‌న్స్ త‌ర్వాత ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌లో విజ‌య్ పాల్గొన‌బోతున్న‌ట్లు స‌మాచారం. రెండు రోజులు డేట్స్ కేటాయించిన‌ట్లు చెబుతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

 

Advertisement
Advertisement