త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | గాంధీ భ‌వ‌న్‌కు రాలేన‌న్న మంత్రి దామోద‌ర‌.. వెనుతిరిగిన పీసీసీ చీఫ్‌

Mahesh Goud | సంగారెడ్డి డీసీసీ అధ్య‌క్షుడి నియామకంపై స్థానిక మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంతారావు (MLA Lakshmi Kanta Rao) మ‌ధ్య వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించిన పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్ (Mahesh Goud) ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది.

G

Telangana | Published On Nov 5, 2026, 4.02 pm IST

Mahesh Goud | గాంధీ భ‌వ‌న్‌కు రాలేన‌న్న మంత్రి దామోద‌ర‌.. వెనుతిరిగిన పీసీసీ చీఫ్‌
Advertisement

Mahesh Goud | త్రినేత్ర న్యూస్‌: సంగారెడ్డి డీసీసీ అధ్య‌క్షుడి నియామకంపై స్థానిక మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంతారావు (MLA Lakshmi Kanta Rao) మ‌ధ్య వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. వారి మ‌ధ్య‌ వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించిన పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్ (Mahesh Goud) ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు ఇద్ద‌రు నేత‌ల‌ను గాంధీ భ‌వ‌న్‌కు (Gandhi Bhavan) రావాల్సిందిగా ఆదేశించారు. ఉదయం మంత్రితో, మధ్యాహ్నం ఎమ్మెల్యేతో మాట్లాడాలని నిర్ణయించారు. అసలు ఏం జరిగింది.. పరిష్కార మార్గం ఏంటి అనే దానిపై ఇద్దరితో విడివిడిగా మాట్లాడాలని భావించారు. మొద‌ట పీసీసీతో భేటీకి ఓకే చెప్పిన మంత్రి దామోద‌ర‌ (Damodara Rajanarasimha).. తీరా స‌మ‌య‌మైన త‌ర్వాత తాను రావడం లేదంటూ సమాచారం ఇచ్చారు.

దీంతో అప్ప‌టికే గాంధీ భ‌వ‌న్‌కు వ‌చ్చిన మహేశ్ గౌడ్.. స‌మావేశానికి మంత్రి దామోద‌ర డుమ్మా కొట్ట‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేను కూడా క‌ల‌వ‌కుండానే వెనుతిరిగారు.

అస‌లేం జ‌రిగిందంటే..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూట‌మి ఈ నెల 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ధ‌ర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివెళ్లారు. ఈ క్ర‌మంలో ఢిల్లీలోని షాంగ్రిలా హోట‌ల్ లాబీలో సంగారెడ్డి (Sangareddy) డీసీసీ నిమాయ‌మ‌కంపై మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ, జుక్క‌ల్ ఎమ్మెల్యే ల‌క్ష్మీకాంతారావు మ‌ధ్య తీవ్ర వాదోప‌వాదాలు జ‌రిగాయి.

అయితే మంత్రి త‌న‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగార‌ని, తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని బెదిరించార‌ని ఆరోపించారు. ఎమ్మెల్యేపై గ‌ట్టిగా అరుస్తూ దుర్భాష‌లాడార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇదే విష‌య‌మై ఇరువురు నేత‌ల‌తో పీసీసీ చీఫ్ (PCC Chief) భేటీ అవ్వాల‌ని నిర్ణ‌యించారు. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని భావించారు. అయితే స‌మావేశానికి మంత్రి హాజ‌రు కాక‌పోవ‌డంతో ఆయ‌న నిరాశ‌గా గాంధీభ‌వ‌న్ నుంచి వెనుతిరాగాల్సి వ‌చ్చింది.

Advertisement
Advertisement