T. Chiranjeevulu | లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే
Lakshman Suicide | తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య (Lakshman Suicide) ప్రభుత్వ హత్యేనని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు (T. Chiranjeevulu) ఆరోపించారు.
- బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
- బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు డిమాండ్
T. Chiranjeevulu త్రినేత్ర న్యూస్: తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య (Lakshman Suicide) ప్రభుత్వ హత్యేనని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు (T. Chiranjeevulu) ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని ఫైరయ్యారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లక్ష్మణ్ గౌడ్ కుటుంబ సభ్యులను గురువారం చిరంజీవులు ఆధ్వర్యంలో పలువురు బీసీ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మహత్యలు ఉండవని, ప్రజల కష్టాలు తీరుతాయని, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించాం. 1,200 మందికి పైగా యువకులు ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం దొరలు, ఆధిపత్య వర్గాల చేతుల్లోకి వెళ్లింది. ప్రాణాలర్పించిన ఉద్యమకారుల కుటుంబాలకే న్యాయం జరగని దుస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి
లక్ష్మణ్ గౌడ్ 2006 నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన నేపథ్యంలో ఆ పార్టీ కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న భారీ ఆర్థిక వనరుల నుంచి కనీసం కోటి రూపాయలు తక్షణమే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందించాలి. తెలంగాణ ఉద్యమకారులు చిందించిన రక్తం, చేసిన త్యాగాల ఫలితంగానే నేడు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు, నాయకులు ఈ స్థాయికి చేరుకున్నారు. అలాంటి ఉద్యమకారుడి కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకపోవడం దురదృష్టకరం అని నాయకులు విమర్శించారు.
గత 12 సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్‌ను పక్కదారి పట్టిస్తూ, ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చని కమీషన్ల ఆధారిత ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారశైలి కూడా అభ్యంతరకరంగా ఉంది. లేని భూ వివాదాలను సృష్టించి లక్ష్మణ్ గౌడ్‌ను మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
ఇంకా ఇవీ డిమాండ్స్..
- బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
- మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
- తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సంక్షేమ సౌకర్యాలు, గుర్తింపు, ప్రయోజనాలను లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి కూడా కల్పించాలి
- లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమకారుడు వట్టే జానయ్య, ఆర్జీవీ మీడియా రాఘవేందర్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకుడు బైరి శేఖర్ గౌడ్, బీసీఐఎఫ్ సభ్యులు అవ్వారు వేణు, చెన్నా శ్రీకాంత్, మామిళ్ల లింగేశ్ యాదవ్, కొండల్ గౌడ్, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●TTD | డిసెంబర్ 20 నుంచి 29 వరకు.. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ
- ●Uttamkumar Reddy | భూగర్భ జలాలు ఎట్లున్నయో చూడండి.. కావాల్సినన్ని నిధులిస్తం
- ●Mahesh Goud | గాంధీ భవన్‌కు రాలేనన్న మంత్రి దామోదర.. వెనుతిరిగిన పీసీసీ చీఫ్
- ●Nayan Sarika | డీజే టిల్లు హీరోతో నయన్ రొమాన్స్ - సుకుమార్ ప్రొడ్యూసర్
- ●Snakes in Car Engine | కార్లు, స్కూటర్లు, టాయిలెట్లలో పాములు ఎందుకు దూరుతాయి? అసలు కారణమిదే..!
- ●Stock Markets | సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. 24,500 దాటిన నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..

TTD | డిసెంబర్ 20 నుంచి 29 వరకు.. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ

Uttamkumar Reddy | భూగర్భ జలాలు ఎట్లున్నయో చూడండి.. కావాల్సినన్ని నిధులిస్తం

Mahesh Goud | గాంధీ భవన్‌కు రాలేనన్న మంత్రి దామోదర.. వెనుతిరిగిన పీసీసీ చీఫ్

Nayan Sarika | డీజే టిల్లు హీరోతో నయన్ రొమాన్స్ - సుకుమార్ ప్రొడ్యూసర్





