Uttamkumar Reddy | భూగర్భ జలాలు ఎట్లున్నయో చూడండి.. కావాల్సినన్ని నిధులిస్తం
Uttamkumar Reddy | తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల్లో భూగర్భ జలాల (Ground water) స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttamkumar Reddy) అధికారులకు సూచించారు.
- జలాల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెడదాం
- మహారాష్ట్రలో అమలవుతున్న జల సంరక్షణ కార్యక్రమాలను పరిశీలించండి
- జిల్లాల వారీగా సమీక్షించి కార్యాచరణ రూపొందించండి
- భూగర్భజల సంరక్షణపై ప్రత్యేక సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Uttamkumar Reddy | త్రినేత్ర న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల్లో భూగర్భ జలాల (Ground water) స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలించాలని.. జలాల పరిరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి అవసరమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttamkumar Reddy) అధికారులకు సూచించారు. మహారాష్ట్రలో అమలవుతున్న జల సంరక్షణ కార్యక్రమాలను పరిశీలించాలన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, నీటిపారుదల శాఖలు చేపట్టాల్సిన పనులపై పలు సూచనలు చేశారు.
కరువు ఉపశమన చర్యలు, భూగర్భజల సంరక్షణ పనులకు కార్యాచరణ ప్రణాళిక ఖరారుపై చర్చించాం. భూగర్భ జలాల పరిరక్షణకు అవసరమైన బడ్జెట్ కేటాయిస్తాం. అవసరమైతే ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు మించి నిధులు సమకూరుస్తాం. భూగర్భజల శాఖ పనితీరు, చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలి. అన్ని జిల్లాల భూగర్భజల శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలి. జిల్లాల వారీగా భూగర్భ జలాల స్థితిగతులను సమగ్రంగా సమీక్షించాలి. భూగర్భజల మట్టాలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయన్న వార్తలపై దృష్టి సారించాలి.
భూగర్భజల సంరక్షణకు ప్రస్తుతం చేపడుతున్న పనులు, భవిష్యత్ అవసరాలను పరిశీలించాలి. రాజస్థాన్‌లో చేపట్టిన భూగర్భజల పునరుద్ధరణ చర్యలను అధ్యయనం చేయాలి. ఇతర రాష్ట్రాల అనుభవాలతో తెలంగాణలో భూగర్భజల సంరక్షణ చర్యలను బలోపేతం చేయాలి. భూగర్భజలాల పరిరక్షణకు అవసరమైనన్ని నిధులు జిల్లాల వారీగా సమీక్షించి కార్యాచరణ రూపొందించాలి అని ఉత్తమ్ సూచించారు.
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ రమేష్‌బాబు, నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ దివ్య, భూగర్భజల శాఖ డైరెక్టర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●TTD | డిసెంబర్ 20 నుంచి 29 వరకు.. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ
- ●Mahesh Goud | గాంధీ భవన్‌కు రాలేనన్న మంత్రి దామోదర.. వెనుతిరిగిన పీసీసీ చీఫ్
- ●Nayan Sarika | డీజే టిల్లు హీరోతో నయన్ రొమాన్స్ - సుకుమార్ ప్రొడ్యూసర్
- ●Snakes in Car Engine | కార్లు, స్కూటర్లు, టాయిలెట్లలో పాములు ఎందుకు దూరుతాయి? అసలు కారణమిదే..!
- ●Stock Markets | సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. 24,500 దాటిన నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..
- ●POCSO Case | మదర్సాలో బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితుడు ఎలా వేధించాడంటే!

TTD | డిసెంబర్ 20 నుంచి 29 వరకు.. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ

Mahesh Goud | గాంధీ భవన్‌కు రాలేనన్న మంత్రి దామోదర.. వెనుతిరిగిన పీసీసీ చీఫ్

Nayan Sarika | డీజే టిల్లు హీరోతో నయన్ రొమాన్స్ - సుకుమార్ ప్రొడ్యూసర్

Snakes in Car Engine | కార్లు, స్కూటర్లు, టాయిలెట్లలో పాములు ఎందుకు దూరుతాయి? అసలు కారణమిదే..!








