TTD | డిసెంబర్ 20 నుంచి 29 వరకు.. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ
TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పది రోజులపాటు వైకుంఠ ద్వార (Vaikunta Dwaram) దర్శనాలు కల్పించనున్నారు. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకోవచ్చు.
Devotional | Published On Nov 5, 2026, 4.30 pm IST
TTD | త్రినేత్ర న్యూస్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పది రోజులపాటు వైకుంఠ ద్వార (Vaikunta Dwaram) దర్శనాలు కల్పించనున్నారు. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకోవచ్చు. దీనికోసం టీటీడీ (TTD) ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించామని, ఈసారి కూడా మరింత సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆన్‌లైన్‌లో ఎస్ఎస్‌డీ టోకెన్లు..
సాధారణ భక్తులకు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం కల్పించేందుకు తొలి మూడు రోజుల పాటు ఆన్‌లైన్ ఈ-డిప్ విధానంలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు (SSD Tokens) కేటాయించాలన్నారు. మిగిలిన ఏడు రోజులు సర్వదర్శనం అమలు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 25న (శుక్రవారం) స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వదర్శనం భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శన క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.
పార్కింగ్ సమస్యలు లేకుండా..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడతామని సీవీఎస్వో మురళీకృష్ణ తెలిపారు. తిరుమలలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Uttamkumar Reddy | భూగర్భ జలాలు ఎట్లున్నయో చూడండి.. కావాల్సినన్ని నిధులిస్తం
- ●Mahesh Goud | గాంధీ భవన్కు రాలేనన్న మంత్రి దామోదర.. వెనుతిరిగిన పీసీసీ చీఫ్
- ●Nayan Sarika | డీజే టిల్లు హీరోతో నయన్ రొమాన్స్ - సుకుమార్ ప్రొడ్యూసర్
- ●Snakes in Car Engine | కార్లు, స్కూటర్లు, టాయిలెట్లలో పాములు ఎందుకు దూరుతాయి? అసలు కారణమిదే..!
- ●Stock Markets | సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. 24,500 దాటిన నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..
- ●POCSO Case | మదర్సాలో బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితుడు ఎలా వేధించాడంటే!

Uttamkumar Reddy | భూగర్భ జలాలు ఎట్లున్నయో చూడండి.. కావాల్సినన్ని నిధులిస్తం

Mahesh Goud | గాంధీ భవన్కు రాలేనన్న మంత్రి దామోదర.. వెనుతిరిగిన పీసీసీ చీఫ్

Nayan Sarika | డీజే టిల్లు హీరోతో నయన్ రొమాన్స్ - సుకుమార్ ప్రొడ్యూసర్

Snakes in Car Engine | కార్లు, స్కూటర్లు, టాయిలెట్లలో పాములు ఎందుకు దూరుతాయి? అసలు కారణమిదే..!






