Allu Cinemas | అల్లు సినిమాస్‌లో పుష్ప 2 చూసిన సీఎం రేవంత్ రెడ్డి – అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లాంఛ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ అల్లు సినిమాస్ గురువారం ప్రారంభమైంది. ఓపెనింగ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ మల్టీప్లెక్స్‌ను లాంఛ్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులతో కలిసి పుష్ప 2 సినిమాను వీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి.
Entertainment | Published On Mar 12, 2026, 8.59 pm IST
Allu Cinemas | హైదరాబాద్‌లోని కోకాపేటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మించిన కొత్త మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ గురువారం ప్రారంభమైంది. అల్లు సినిమాస్ ఓపెనింగ్‌ను ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. మల్టీప్లెక్స్ లాంఛ్ సందర్భంగా అల్లు అర్జున్‌తో పాటు సినీ ప్రముఖులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కొద్ది సేపు పుష్ప 2 సినిమాను వీక్షించారు.
మూవీ లవర్స్‌కు నెక్స్ట్ వీక్ నుంచి...
హైదరాబాద్‌లోని కోకాపేటలో అత్యాధునిక వసతులతో అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను నిర్మించారు. దేశంలోనే అతి పెద్ద డాల్బీ అట్మాస్ స్క్రీన్‌ను అల్లు సినిమాస్ మొదలైంది. ఈ మల్టీప్లెక్స్ థియేటర్ గురువారం ప్రారంభమైన....మూవీ లవర్స్‌కు మాత్రం మార్చి 19 నుంచి అందుబాటులోకి రానుంది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ట్రయల్ స్క్రీనింగ్‌ను నిర్వహించబోతున్నారు.
తెలుగు దర్శకులకు గౌరవం...
అల్లు సినిమాస్ థియేటర్‌లో తెలుగు దర్శకులను గౌరవిస్తూ వారి ఫొటోలు ఏర్పాటుచేశారు అల్లు అర్జున్. కే బాలచందర్, రాఘవేంద్రరావు నుంచి సందీప్ వంగా, సుకుమార్ వరకు దర్శకులందరి ఫొటోలు ఈ థియేటర్‌లో కనిపించాయి.
డిప్యూటీ సీఎం...
అల్లు సినిమాస్ లాంఛింగ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి , అల్లు అర్జున్, అల్లు అరవింద్‌తో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు .అల్లు సినిమాస్ ఓపెనింగ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి హాజరయ్యారు. అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






