Tirupparankundram | భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుప్పరంకుండ్రం కొండపై డిసెంబర్ 15 దాకా దీపాలు వెలిగించొచ్చు!
Tirupparankundram | తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవం సందర్భంగా భక్తులకు ఆలయ అధికారులు కీలక అనుమతి ఇచ్చారు. కొండపై ఉన్న ఉచ్చిపిళ్లయార్ ఆలయం సమీపంలోని నిర్ణీత ప్రదేశంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 15 వరకు భక్తులు దీపాలు వెలిగించుకోవచ్చని వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ అవకాశం కల్పించారు.
Devotional | Published On Nov 29, 2026, 1.06 pm IST
Tirupparankundram | తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవం సందర్భంగా భక్తులకు ఆలయ అధికారులు కీలక అనుమతి ఇచ్చారు. కొండపై ఉన్న ఉచ్చిపిళ్లయార్ ఆలయం సమీపంలోని నిర్ణీత ప్రదేశంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 15 వరకు భక్తులు దీపాలు వెలిగించుకోవచ్చని వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ అవకాశం కల్పించారు. అరుళ్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న రిసీవర్ల ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకుని దీపాలు వెలిగిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించారు. కొండపైకి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. దీపాలు వెలిగించే ప్రాంతంలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో దీపథూన్ వద్ద మహాదీపం
తిరుప్పరంకుండ్రం కొండపై దీపథూన్ వద్ద కార్తీక మహాదీపం వెలిగించే విషయంలో నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో తెరపడింది. కోర్టు ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తుల పర్యవేక్షణలో దీపథూన్ వద్ద మహాదీపాన్ని వెలిగించారు. దీంతో కొండపై భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. దీపోత్సవ వేడుకలతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. పలువురు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా భక్తులకు కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మురుగన్‌ను స్మరించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం దీపోత్సవంపై హర్షం వ్యక్తం చేశారు. చెడును సంహరించే, విజయానికి ప్రతీక అయిన వేలాయుధాన్ని ధరించిన స్వామి మురుగన్ ఆశీస్సులతో అందరి జీవితాల్లో కార్తీక దీపపు వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. చీకట్లు తొలగిపోయి ప్రజలకు సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు.
వివాదం ఏంటీ?
తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవం సందర్భంగా దీపథూన్ వద్ద మహాదీపం వెలిగించేందుకు అనుమతి నిరాకరించడంపై వివాదం మొదలైంది. దీపథూన్ వద్ద దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చినప్పటికీ, తొలుత అక్కడ దీపం వెలుగలేదు. నవంబర్ 24న జరిగిన వార్షిక కార్తీక దీపోత్సవంలో ఉచ్చిపిళ్లయార్ ఆలయం సమీపంలోనే మహాదీపాన్ని వెలిగించారు. ఈ క్రమంలో దీపథూన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీపథూన్ వద్ద మహాదీపం వెలగడంతో వివాదానికి కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఉచ్చిపిళ్లయార్ ఆలయం సమీపంలోనూ భక్తులు దీపాలు వెలిగించేందుకు అనుమతి ఇవ్వడంతో భక్తులకు మరింత వెసులుబాటు లభించినట్లయ్యింది.
#WATCH | Madurai, Tamil Nadu: Devotees arrive at Thiruparankundram hill as the Thiruparankundram temple administration permits devotees to light lamps at a designated spot near the Uchipillaiyar Temple from November 29 to December 15, 2026, between 10:00 AM and 4:30 PM daily.
A heavy security force is deployed at the spot and is conducting thorough checks.
— ANI (@ANI) November 29, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి
- ●Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?
- ●Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం
- ●Chiranjeevi | ఆటో జానీ ఈజ్ బ్యాక్ - రూమర్లకు చెక్ పెట్టిన కాకా
- ●High Court | రెండు వారాల జైలుశిక్ష.. హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీ
- ●Softball | జాతీయ వేదికపై సాఫ్ట్‌బాల్.. ఖేలో ఇండియాలో తొలిసారి అవకాశం

Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి

Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?

Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం

Chiranjeevi | ఆటో జానీ ఈజ్ బ్యాక్ - రూమర్లకు చెక్ పెట్టిన కాకా





