త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | డ్యూయ‌ల్ రోల్‌లో మెగాస్టార్ – సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి మెగా 158

చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న మెగా 158 మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Jun 14, 2026, 4.09 pm IST

Chiranjeevi | డ్యూయ‌ల్ రోల్‌లో మెగాస్టార్ – సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి మెగా 158
Advertisement

Chiranjeevi |  మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీతో ఈ ఏడాది సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. చిరంజీవి కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. సంక్రాంతి సెంటిమెంట్‌ను మ‌రోసారి రిపీట్ చేయ‌బోతున్నారు మెగాస్టార్‌. వ‌చ్చే ఏడాది పండుగ బ‌రిలో నిల‌వ‌బోతున్నారు. చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న మూవీ 2027 సంక్రాంతికి ప్రేక్ష‌కుల రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అన‌స్వ‌ర రాజ‌న్‌....

మెగా 158 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో హై ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో అన‌స్వ‌ర రాజ‌న్‌, నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. శాండ‌ల్‌వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ఫ‌స్ట్ షెడ్యూల్ ఇటీవ‌లే పొల్లాచ్చిలో ముగిసింది. చిరంజీవితో పాటు అన‌స్వ‌ర రాజ‌న్‌, నివేదా థామ‌స్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

డ్యూయ‌ల్ రోల్‌...

కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాబీ సినిమాలో మెగాస్టార్ డ్యూయ‌ల్ రోల్ చేయ‌బోతున్నాడ‌ని అంటున్నారు. మెగా 158లో చిరంజీవి సోద‌రుడిగా తొలుత మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్‌లాల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ మోహ‌న్‌లాల్ బిజీగా ఉండ‌టంతో డేట్స్ ఇష్యూ వ‌ల్ల సినిమా చేయ‌లేక‌పోయార‌ట‌. దాంతో ఈ మ‌ల‌యాళ హీరో క్యారెక్ట‌ర్‌లో కూడా చిరంజీవే క‌నిపించ‌నున్నార‌ట‌. డ్యూయల్ రోల్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ద్విపాత్రాభియానికి త‌గ్గ‌ట్లుగా క‌థ‌లో బాబీ మార్పులు చేర్పులు చేసిన‌ట్లు చెబుతోన్నారు. ఓ పాత్ర క్లాస్‌గా, మ‌రో పాత్ర మాస్ యాంగిల్‌లో సాగుతుంద‌ని అంటున్నారు.

సంక్రాంతికే రిలీజ్‌...

మెగా 158ను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నార‌ట‌. పండుగ‌ను దృష్టిలో పెట్టుకొనే చ‌కాచ‌కా షూటింగ్‌ను ఫినిష్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నెలాఖ‌రున హైద‌రాబాద్‌లో ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. మెగా 158 మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Advertisement
Advertisement