Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి – మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్
వాల్తేర్ వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో ఓ మాస్ యాక్షన్ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు కదిరి కాకాజీ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ మూవీ టైటిల్‌తో పాటు చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదలచేయబోతున్నట్లు తెలిసింది.
Entertainment | Published On Aug 13, 2026, 2.52 pm IST
Chiranjeevi | వాల్తేర్ వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 158వ మూవీ ఇది. ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో సగం టైటిల్‌ను చిరంజీవి రివీల్ చేశారు. తమన్‌తో పాటు మిగిలిన చిత్ర యూనిట్ వారించడంతో సెలైంట్ అయ్యారు. కదిరి అని మాత్రమే చెప్పారు. పూర్తిగా టైటిల్ ఏమిటన్నది మాత్రం చిరంజీవి వెల్లడించలేదు. మెగా 158కు కదిరి కాకాజీ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. కదిరి బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుందని, ఈ సినిమాలో చిరంజీవి... కాకాజీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఆయన పాత్ర పేరుతోనే ఈ సినిమాకు కదిరి కాకాజీ అనే పేరును మేకర్స్ కన్ఫామ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
బర్త్ డే ట్రీట్....
చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా 158 టైటిల్ తో పాటు ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్ ను ఆగస్ట్ 22న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ సాగే ఈ వీడియో గ్లింప్స్ నిడివి నిమిషం పైనే ఉంటుందని సమాచారం. చాలా పవర్ ఫుల్ గా ఈ గ్లింప్స్ సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. కదిరి కాకాజీ మూవీలో మలయాళ నటి అనస్వర రాజన్ తో పాటు నివేథా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జననాయగన్, టాక్సిక్...
జననాయగన్ , టాక్సిక్ సినిమాల నిర్మాత వెంకట నారాయణ...కదిరి కాకాజీ మూవీతో నిర్మాతగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
విశ్వంభర రిలీజ్‌కు రెడీ...
చిరంజీవి మరో మూవీ విశ్వంభర రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు అవుతోంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ హంగులు ఆలస్యం కావడంతో వాయిదాపడింది. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్‌లో విశ్వంభర థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి బర్త్‌డే రోజు విశ్వంభర రిలీజ్ డేట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సోషియా ఫాంటసీ యాక్షన్ మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటించగా...ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రను పోషించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Google Pixel 11 Pro Fold | గూగుల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ధర..
- ●Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ
- ●Advanced Tip | ముందస్తు టిప్ కుదరనే కుదరదు.. యాప్ లో నుంచి ఆప్షన్ తొలగించండి..క్యాబ్ సంస్థలకు కేంద్రం ఝలక్..
- ●ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..
- ●Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం
- ●Ponnam Prabhakar | ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు.. 100 శాతం సబ్సిడీతో బీసీ మహిళలకు: మంత్రి పొన్నం ప్రభాకర్
Google Pixel 11 Pro Fold | గూగుల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ధర..

Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ

Advanced Tip | ముందస్తు టిప్ కుదరనే కుదరదు.. యాప్ లో నుంచి ఆప్షన్ తొలగించండి..క్యాబ్ సంస్థలకు కేంద్రం ఝలక్..

ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..






