Mana Shankara Vara Prasad Garu Review | మన శంకర వరప్రసాద్ గారు రివ్యూ – చిరంజీవి, వెంకటేష్ కాంబో అదిరిందా? సినిమా ఎలా ఉందంటే?
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో ఫస్ట్ టైమ్ వచ్చిన మూవీ మన శంకర వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా సోమవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Entertainment | Published On Jan 12, 2026, 4.21 am IST
Mana Shankara Vara Prasad Garu Review | సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి కెరీర్ ఓ హిట్టు రెండు ఫ్లాప్‌లు అన్న చందంగా సాగిపోతుంది. చిరంజీవి గత మూవీ భోళా శంకర్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ ఫ్లాప్ అనంతరం దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మన శంకర వరప్రసాద్‌గారుతో ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. నయనతార హీరోయిన్‌గా నటించింది. ఫన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన మన శంకర వరప్రసాద్‌గారు ఎలా ఉంది. చిరంజీవికి అనిల్ రావిపూడి హిట్టిచ్చారా? చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫస్ట్ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
ప్రసాద్...శశిరేఖ కథ...
శంకర వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (చిరంజీవి) సెంట్రల్ మినిస్టర్ నితిన్ శర్మకు ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌తో పాటు అందరితో సరదాగా ఉంటాడు. ఓ రౌడీ గ్యాంగ్ నుంచి తన ప్రాణాలు కాపాడిన ప్రసాద్‌ను ఫ్యామిలీ మెంబర్‌లాగే సెంట్రల్ మినిస్టర్ భావిస్తుంటాడు. జోవియల్‌గా ఉంటే ప్రసాద్ మనసులో మాత్రం అంతులేని బాధను మోస్తుంటాడు. ఇండియాలోనే టాప్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ(నయనతార) ....ప్రసాద్ భార్య. ప్రసాద్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్న శశిరేఖ అతడికి విడాకులు ఇస్తుంది. తన పిల్లలను కూడా తండ్రిని ద్వేషించేలా పెంచుతుంది శశిరేఖ. అందుకు కారణమేమిటి? శశిరేఖ, ప్రసాద్ విడిపోవడానికి కారణమైన జీవీఆర్ (శరధ్ ఖేల్కర్) ఎవరు? శశిరేఖతో పాటు తన పిల్లల ప్రాణాలు కాపాడటానికి మాజీ భార్య ఇంటికే సెక్యూరిటీ ఆఫీసర్‌గా ప్రసాద్ ఎందుకు రావాల్సివచ్చింది? ప్రసాద్ ను కాదని వెంకీ గౌడ (వెంకటేష్) పెళ్లి చేసుకోవడానికి శశిరేఖ ఎందుకు ఒప్పుకుంది? అన్నదే ఈ మూవీ కథ.
కామెడీ టైమింగ్....
సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి ఎక్కువగా మాస్, యాక్షన్ కథలతోనే సినిమాలు చేశారు. ఆయనలోని కామెడీ టైమింగ్‌ను వెలికితీసే ప్రయత్నం కొత్త దర్శకులు ఎవరూ చేయలేదు. చంటబ్బాయి, అందరివాడు, జై చిరంజీవతో పాటు పలు సినిమాల్లో తన దైన మార్క్ పంచ్‌లు, ప్రాసలతో చిరంజీవి అభిమానులను అలరించారు. అలాంటి కామెడీ కలగలిసిన మాస్ రోల్‌లో చిరంజీవిని చూసి చాలానే కాలమైంది. మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవిలోనే ఆ యాంగిల్‌ను బలంగా నమ్ముకున్నారు అనిల్ రావిపూడి. కథ కంటే చిరంజీవి ఇమేజ్, ఆయన ఫన్నీ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీని హైలైట్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. వాటికి తోడు తనదైన ట్రేడ్ మార్కు ఫ్యామిలీ డ్రామాను జోడించి ఫర్‌ఫెక్ట్ సంక్రాంతి మూవీగా మన శంకర వరప్రసాద్‌గారును మలిచారు.
కొత్త కథ కాదు...
మన శంకర వరప్రసాద్ గారు కోసం అనిల్ రావిపూడి ఎంచుకున్న కథలో కొత్తదనం అస్సలు కనిపించదు. ఈ పాయింట్‌తో తెలుగులో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. రొటీన్ పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో మాత్రం అనిల్ రావిపూడి పూర్తిగా సక్సెస్ అయ్యారు.
భార్య పిల్లలకు దూరమైన ఓ తండ్రి కథ ఇది. తన వారికి దగ్గర కావడానికి అతడు ఏం చేశాడు? ఎలాంటి ప్లాన్స్ వేసి వారి మనసులను గెలుచుకున్నాడు అన్నదే ఈ సినిమా స్టోరీలైన్. మూడు ముక్కల్లో ముగిసిపోయే ఈ సింపుల్ పాయింట్‌తో రెండు గంటల నలభైనాలుగు నిమిషాల పాటు నవ్వించారు అనిల్ రావిపూడి.
ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీనే కానీ ఎక్కడ ఓవర్ మెలో డ్రామా ఉండదు. సీరియస్‌గా చెప్పాల్సిన సీన్ల నుంచి కామెడీని రాబట్టుకున్నారు. తన కూతురిని ఓ రౌడీ కొట్టాడని ఆవేశంగా అతడి దగ్గరకు వెళతాడు ప్రసాద్. రొటీన్‌గా అయితే అక్కడో పెద్ద ఫైట్ పెట్టచ్చు. రెగ్యులర్ ఫార్మెట్‌లో కాకుండా ఆ సీన్‌లో కూడా కామెడీనే నమ్ముకున్నారు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి ఫ్రేమ్‌లో ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. శశిరేఖకు దగ్గర కావడానికి ప్రసాద్ వేసే ప్లాన్లు...అవన్నీ అడ్డంగా బెడిసికొట్టడం, అతడి టీమ్ ఇచ్చే సలహాలు...వారి ముందు అతడు ఇచ్చే బిల్లప్‌లు ఫెయిలై బుక్కయ్యే సీన్లు....ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తెగ మెప్పిస్తాయి. అందులో నో డౌట్. కామెడీ విషయంలో చాలా క్లీన్‌గా వెళ్లారు. ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్, గ్లామర్ సీన్ లేకుండా జాగ్రత్త పడ్డారు.
ఫస్ట్ హాఫ్...ప్రసాద్, శశిరేఖ ప్రేమాయణం, వారు విడిపోవడం, పిల్లలకు ప్రసాద్ దగ్గరవ్వడం లాంటి సీన్లతో సాగుతుంది. శశిరేఖ ఇంటికే సెక్యూరిటీ ఆఫీసర్‌గా వచ్చే సీన్‌తో సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుంచి కథ చాలా వరకు ఒకే ఇంటిలో సాగుతుంది. సెక్యూరిటీ పేరుతో చిరంజీవి అండ్ గ్యాంగ్ చేసే హడావిడి టైమ్‌పాస్ చేస్తుంది.
వెంకీ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్...
వెంకటేష్ ఎంట్రీతో సినిమా స్వరూపమే మారిపోయింది. ఒకే పాయింట్ చుట్టూ సాగుతూ సినిమా బోర్ కొట్టిస్తుందని ఆడియెన్స్ ఫీలయ్యే టైమ్‌లోనే వెంకీ క్యారెక్టర్‌ను ప్రవేశపెట్టి జోష్ తీసుకున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి, వెంకటేష్ సూపర్‌హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసే సీన్లు, మెగా విక్టరీ సాంగ్ అభిమానులకు ట్రీట్‌లా ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఇద్దరి హీరోలను బ్యాలెన్స్ చేస్తూ డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది.
ప్లస్‌లు మాత్రమే కాదు మైనస్‌లు కూడా మన శంకర వరప్రసాద్‌గారులో ఉన్నాయి. ముందే చెప్పినట్లు ఇది కొత్త కథ కాదు. పంచ్‌లు, కామెడీ అనుకున్న స్థాయిలో లేవు. స్కూల్ ఎపిసోడ్ బోరింగ్‌గా సాగుతుంది.
వింటేజ్ మెగాస్టార్...
చిరంజీవికి మన శంకర వరప్రసాద్‌గారు మంచి కమ్‌బ్యాక్ మూవీ. సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో తన స్వాగ్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టారు. పాటల్లో ఆయన వేసిన స్టెప్పులు బాగున్నాయి. కొన్ని సీన్లలో వింటేజ్ మెగాస్టార్ కనిపించారు. నయనతార పాత్ర జస్ట్ ఓకే. యాక్టింగ్ పరంగా చేయడానికి ఏం లేదు. వెంకటేష్ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఆయన క్యారెక్టర్‌కు పెట్టిన మ్యానరిజమ్స్, కన్నడంలో ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. జీవీఆర్ అనే పాత్రలో శరధ్ ఖేల్కర్ నటన బాగుంది. చిరంజీవి గ్యాంగ్ మెంబర్స్‌గా క్యాథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం కామెడీ సినిమాకు ప్లస్సయ్యింది. జరీనా వహాబ్ మూడు, నాలుగు సన్నివేశాల్లోనే కనిపించినా మెప్పించింది.
భీమ్స్ పాటలు సూపర్...
మన శంకర వరప్రసాద్‌కు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మరో హీరోగా నిలిచాడు. గ్యాంగ్‌లీడర్‌లోని థీమ్ మ్యూజిక్‌తో అతడి ఇచ్చి బీజీఎమ్ బాగుంది. శశిరేఖతో పాటు ప్రతి పాట మెలోడీ ప్రధానంగా బాగున్నాయి. చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్, మెగా విక్టరీ సాంగ్ విజువల్‌గా బాగున్నాయి. తక్కువ బడ్జెట్‌లో అయినా కలర్‌ఫుల్‌గా ఈ సినిమా తీశారు.
చిరంజీవి సూపర్ హిట్ సినిమాల రిఫరెన్స్‌లు బాగా వాడుకున్నారు అనిల్ రావిపూడి. జ్వాల, శశిరేఖ...అంటూ చిరంజీవి పాత సినిమాల్లోని హీరోయిన్ల పేర్లను బాగా వాడుకున్నారు. కథకుడిగా కంటే డైరెక్టర్‌గా మెప్పించారు. మెగా విక్టరీ సాంగ్‌లో స్పెషల్ అప్పీరియన్స్‌లో మెరిశారు అనిల్ రావిపూడి.
మెగా అభిమానులకు మన శంకర వరప్రసాద్‌గారు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. సంక్రాంతికి కుటుంబమంతా కలిసి చూసే మంచి సినిమా. . చిరంజీవి, వెంకటేష్ కాంబో మ్యాజిక్ బాగా వర్కవుట్ అయ్యింది.
రేటింగ్ : 3/5
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



