Telugu OTT | ఓటీటీలోకి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు – ఒకే రోజు ఏడు భాషల్లో రిలీజ్
చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ మన శంకర వరప్రసాద్‌గారు ఓటీటీ రిలీజ్ డేట్‌పై అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో...ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
Entertainment | Published On Feb 3, 2026, 2.48 pm IST
Telugu OTT | మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ మన శంకర వరప్రసాద్‌గారు ఓటీటీ రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలో సందడి చేయబోతుంది. సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన మన శంకర వరప్రసాద్‌గారు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
వెంకటేష్ గెస్ట్ రోల్...
మన శంకర వరప్రసాద్‌గారులో నయనతార హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించారు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీగా మన శంకర వరప్రసాద్‌గారు నిలిచింది. కేథరిన్, హర్షవర్థన్, అభినవ్ గోమటం , శరద్ ఖేల్కర్ కీలక పాత్రల్లో కనిపించారు.
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా మన శంకర వరప్రసాద్‌గారు నిలిచింది. చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేష్‌తో ఆయన కాంబీనేషన్‌లో వచ్చిన సీన్లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన పాటలు కూడా ఈ సినిమా విషయంలో కీలకంగా నిలిచాయి. మన శంకర వరప్రసాద్‌గారు మూవీని చిరంజీవి కూతురు సుస్మితతో కలిసి ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించారు.
ఓటీటీలోకి...
మన శంకర వరప్రసాద్‌గారు మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఫ్యాన్సీ రేటుకు జీ5 ఓటీటీ దక్కించుకుంది. ఈ మేరకు ఓటీటీ రిలీజ్ డేట్‌పై జీ5 మంగళవారం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. త్వరలోనే చిరంజీవి ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటించింది. డేట్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడంతో పాటు మరాఠీ, బెంగాళీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
శంకర వరప్రసాద్‌గారు కథ....
శంకర వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (చిరంజీవి) సెంట్రల్ మినిస్టర్‌కు ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అందరితో సరదాగా ఉండే ప్రసాద్ మనసులో మాత్రం అంతులేని బాధను మోస్తుంటాడు. ఇండియాలోనే టాప్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ(నయనతార)ను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు ప్రసాద్. మనస్పర్థల కారణంగా ప్రసాద్ నుంచి విడాకులు తీసుకుంటుంది శశిరేఖ. పిల్లలను కూడా తండ్రి ప్రసాద్ ద్వేషించేలా పెంచుతుంది శశిరేఖ. అందుకు కారణమేమిటి? శశిరేఖ, ప్రసాద్ విడిపోవడానికి కారణమైన జీవీఆర్ (శరధ్ ఖేల్కర్) ఎవరు? శశిరేఖతో పాటు తన పిల్లల ప్రాణాలు కాపాడటానికి మాజీ భార్య ఇంటికే సెక్యూరిటీ ఆఫీసర్‌గా ప్రసాద్ ఎందుకు రావాల్సివచ్చింది? ప్రసాద్ ను కాదని వెంకీ గౌడ (వెంకటేష్) పెళ్లి చేసుకోవడానికి శశిరేఖ ఎందుకు ఒప్పుకుంది? అన్నదే మన శంకర వరప్రసాద్‌గారు మూవీ కథ.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



