త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

kaaka | జోరు మీదున్న కాకా – డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు – ఐదు నెల‌ల్లోనే షూటింగ్ కంప్లీట్‌

మెగాస్టార్ చిరంజీవి జోరుమీదున్నారు. కాకా మూవీ షూటింగ్ జ‌రుగుతోండ‌గానే మ‌రోవైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టారు. శుక్ర‌వారం నుంచి డ‌బ్బింగ్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. బాబీ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న కాకా మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Sep 25, 2026, 4.31 pm IST

kaaka | జోరు మీదున్న కాకా – డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు – ఐదు నెల‌ల్లోనే షూటింగ్ కంప్లీట్‌
Advertisement

kaaka  సినిమాల ప‌రంగా మెగాస్టార్ చిరంజీవి జోరుమీదున్నారు. యంగ్ హీరోల‌తో పోటీప‌డి షూటింగ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం హీరోలంతా ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్లు టైమ్ తీసుకుంటున్నారు. కానీ చిరంజీవి మాత్రం నాలుగు నెల‌ల్లోనే కొత్త సినిమా షూటింగ్‌ను దాదాపు పూర్తిచేశారు.

వాల్తేర్ వీర‌య్య‌....

వాల్తేర్ వీర‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ కాకా. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మ‌ల‌యాళ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్‌తో పాటు నివేథా పేతురాజ్‌, స్నేహ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. జ‌న‌నాయ‌గ‌న్‌, టాక్సిక్ సినిమాల‌ను నిర్మించిన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ తెలుగులో నిర్మిస్తున్న మొద‌టి మూవీ ఇది.

డ్యూయ‌ల్ షేడ్‌....

కాకా సినిమాలో చిరంజీవి డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆక్వా ప‌రిశ్ర‌మ‌ను న‌డిపే మిడిల్ క్లాస్ వ్య‌క్తి స‌త్యం....గ్యాంగ్‌స్ట‌ర్ క‌దిరి కాళిదాస్‌గా.... క్లాస్‌, మాస్ క‌ల‌బోత‌గా చిరంజీవి పాత్ర సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రెండు పాత్ర‌ల్లో చిరంజీవి వేరియేష‌న్స్‌, డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటాయ‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

వీడియో రిలీజ్‌...

కాకా మూవీ షూటింగ్ జ‌రుగుతుండ‌గానే మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టారు. శుక్ర‌వారం నుంచి డ‌బ్బింగ్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేక‌ర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. కాకా షూటింగ్ కూడా తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ నెలాఖ‌రులోగా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తికానున్న‌ట్లు స‌మాచారం. చివ‌రి నిమిషంలో రిలీజ్ టెన్ష‌న్లు, వాయిదాలు లేకుండా డిసెంబ‌ర్ లోగా షూటింగ్‌తో పాటు పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొత్తం పూర్తిచేయాల‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు స‌మాచారం.

కాగా షూటింగ్ పూర్తికాక‌ముందే కాకా డిజిట‌ల్ రైట్స్ అమ్ముడుపోయాయి. రికార్డు ధ‌ర‌కు జీ5 ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement