Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో మరో కామెడీ మూవీ రాబోతుంది. చంద్రయాన్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Entertainment | Published On Sep 4, 2026, 8.59 pm IST
Tollywood | రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో నిర్మాతగా పెద్ద హిట్‌ను అందుకున్నాడు డైరెక్టర్ వేణు ఊడుగుల . ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రొడ్యూసర్‌గా మరో కొత్త ప్రయత్నం చేయబోతున్నాడు. తెలంగాణ కామెడీ మూవీతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
శివకుమార్ ధీకొండ...
ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు చంద్రయాన్ అనే పేరును ఖరారు చేశారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చంద్రయాన్‌కు శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మందమర్రి...
శుక్రవారం రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. మందమర్రి అనే ఊరిలోని ముగ్గురు యువకులు బైక్ టైర్లు, కుక్కర్, డంబెల్..ఇలా తమకు దొరికిన వస్తువులతో సొంతంగా రాకెట్ తయారు చేసి చందమామ దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించినట్లుగా ఈ మోషన్ పోస్టర్‌లో కనిపిస్తోంది. ముగ్గురు యువకుల చంద్రయాన్ యాత్రను ఎందుకు చేపట్టారు? ఈ సాహసం చేయడం వెనక కారణాలు ఏంటి? శాస్త్రవేత్తలకే సవాలు విసిరే చంద్రయాన్ లో ఈ ముగ్గురు యువకులు విజయం సాధించారా? లేదా? వంటి అంశాలతో మోషన్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. చంద్రయాన్ సినిమాకు హర్ష ప్రవీణ్ సంగీతం అందించారు. మోషన్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో రామ రామ రామ ఉయ్యాలో పాట ఆకట్టుకుంటుంది. ఈ పాటను కనకవ్వ, శ్రీనిజ భడూరి, లాస్య పాడారు. చంద్రయాన్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ – విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 4, 2026

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య – రష్మిక మందన్న ఊరితో లింక్?
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
- ●Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ
- ●Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు
- ●Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు
- ●Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
- ●DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు

Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు



