త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cbfc | జ‌న‌నాయ‌గ‌న్ ఎఫెక్ట్ – సెన్సార్ రూల్స్ ఛేంజ్ – ఇక నుంచి 18 రోజుల్లోనే స‌ర్టిఫికెట్‌

జ‌న‌నాయ‌గ‌న్ వివాదం నేప‌థ్యంలో సెన్సార్ స‌ర్టిఫికెట్ విష‌యంలో రూల్స్‌ను ఛేంజ్ చేసింది కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌. సెన్సార్ స‌ర్టిఫికెట్ క‌నీస గ‌డువును 48 రోజుల నుంచి 18 రోజుల‌కు త‌గ్గించింది. ఈ విష‌యాన్ని సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ మురుగ‌న్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Feb 5, 2026, 5.21 pm IST

Cbfc | జ‌న‌నాయ‌గ‌న్ ఎఫెక్ట్ – సెన్సార్ రూల్స్ ఛేంజ్ –  ఇక నుంచి 18 రోజుల్లోనే స‌ర్టిఫికెట్‌
Advertisement

Cbfc |  ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ వివాదం కోలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండ‌స్ట్రీల‌లో సంచ‌ల‌నంగా మారింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఈష్యూ కార‌ణంగా వాయిదాప‌డింది. ఈ సినిమాలోని పొలిటిక‌ల్ స‌న్నివేశాల‌పై సెన్సార్ బోర్డు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. హింసాత్మ‌క స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, వాటిని తొల‌గించాల‌ని మేక‌ర్స్‌కు సెన్సార్ బోర్డు సూచించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. సెన్సార్ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన మేక‌ర్స్ తొలుత మ‌ద్రాస్ హైకోర్టును...అక్క‌డి నుంచి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అయిన ఈ వివాదం మాత్రం కొలిక్కిరాలేదు.

సుప్రీంకోర్టు...

జ‌న‌నాయ‌గ‌న్ వివాదంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని హైకోర్టులోనే ప‌రిష్క‌రించుకోవాల‌ని అన్న‌ది. గ‌త నెల రోజులుగా జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ వివాదం మ‌ద్రాస్ హైకోర్టులో నానుతోంది.జ‌న‌నాయ‌గ‌న్ వివాదం నేప‌థ్యంలో సెన్సార్ రూల్స్‌ను మార్చాలంటూ ఆర్‌జీవీతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. క్రియేటివిటీకి సెన్సార్ రూల్స్ అడ్డంకిగా మారాయంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.ఈ ట్రోల్స్ నేప‌థ్యంలో కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ సెన్సార్ గుడువును త‌గ్గిస్తూ కొత్త రూల్స్‌ను అమ‌లులోకి తీసుకొచ్చింది. ఇది వ‌ర‌కు ఓ సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డానికి క‌నీస గ‌డువు న‌ల‌భై ఎనిమిది రోజులుగా ఉండేది. ఆ టైమ్‌ను 18 రోజుల‌కు త‌గ్గించిన‌ట్లు కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఆన్‌లైన్ విధానంలో కేవ‌లం 18 రోజుల్లోనే సెన్సార్ స‌ర్టిఫికెట్‌ను పొంద వ‌చ్చ‌ని కేంద్ర మంత్రి ఎల్ మురుగ‌న్ పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఇక సెన్సార్ స‌ర్టిఫికెట్ కోసం నెల‌ల త‌ర‌బ‌డి ఎదురుచూడాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని సినీ ప్ర‌ముఖులు చెబుతోన్నారు.

ఈ సినీ ప్ర‌మాణ్...

సెన్సార్ జాప్యంపై చాలా కాలంగా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో 2024 సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ చ‌ట్టం తీసుకువ‌చ్చిన కేంద్ర ఈ సినీ ప్ర‌మాణ్ పేరుతో ఆన్‌లైన్ స‌ర్టిఫికెట్ సిస్ట‌మ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ విధానంలో బోర్డు స‌భ్యుల‌కు క‌ల‌వ‌కుండానే త‌మ సినిమాల‌ను సెన్సార్ చేసుకునే అవ‌కాశాన్ని నిర్మిత‌ల‌కు క‌ల్పించింది.

 

 

Advertisement
Advertisement